మట్టి గణపతిని పూజిద్దాం ప్రకృతిని కాపాడుకుందాం
కేశంపేట మాజీ జెడ్పిటిసి విశాల శ్రావణ్ రెడ్డి
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ షాద్ నగర్ కేశంపేట: వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని కేశంపేట మాజీ జడ్పిటిసి విశాల శ్రావణ్ రెడ్డి సూచించారు. గణపతిని భక్తితో పూజించడంతోపాటు ప్రకృతిని కాపాడే విధంగా పండుగను నిర్వహించుకోవాలని ఆమె కోరారు. పర్యావరణానికి హాని కలిగించని మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి కాలుష్యాన్ని తగ్గించేలా ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ప్రకృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. భక్తి సాంప్రదాయాలతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ గణేష్ ఉత్సవాలను ఆనందంగా జరుపుకోవాలని విశాల శ్రావణ్ రెడ్డి ఆకాంక్షించారు.
Tags:
About The Author
Related Posts
Latest News
12 Sep 2026 22:19:25
లోకల్ గైడ్ షాద్ నగర్ కేశంపేట: వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని కేశంపేట మాజీ జడ్పిటిసి విశాల...
