ముగిసిన శ్రావణ మాస భజన కార్యక్రమం.

నెల రోజులుగా భక్తిశ్రద్ధలతో కొనసాగిన భజన కార్యక్రమం.

Published On
ముగిసిన శ్రావణ మాస భజన కార్యక్రమం.

 

 

నిర్మల్ : లోకల్ గైడ్ :
కుబీర్ మండలం పార్డి (బి) గ్రామంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో నెల రోజులుగా భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న శ్రావణమాస భజన కార్యక్రమం శుక్రవారం ఘనంగా ముగిసింది. శ్రావణమాసం ప్రారంభం నుంచి ప్రతిరోజూ ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భజనలు, కీర్తనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు, యువత, వృద్ధులు భక్తి పాటలు ఆలపిస్తూ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నెల రోజుల పాటు భజన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన భక్తులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
శ్రావణమాస భజన సమాప్తి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంతో ఆలయ పరిసరాలు భక్తి వాతావరణంతో సందడిగా మారాయి.ఈ  ఈ కార్యక్రమంలో భజన మండలి సభ్యులు  పూజారి జంగం దత్తాత్రి,  
గోపు రాజేశ్వర్, శేరి 
భోజన్న చింతల రాజన్న, లింగంపల్లి నందు, బండి శంకర్, 
కుష్టపూర్ శంకర్, 
కొట్టె సాయినాథ్,
గాంధారి సాయినాథ్, 
బ్యారపు రమేష్,
దావుల శివ్వయ్య
తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

మట్టి గణపతిని పూజిద్దాం ప్రకృతిని కాపాడుకుందాం మట్టి గణపతిని పూజిద్దాం ప్రకృతిని కాపాడుకుందాం
లోకల్ గైడ్ షాద్ నగర్  కేశంపేట: వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని కేశంపేట మాజీ జడ్పిటిసి విశాల...
ముందస్తు అరెస్టులు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు
ముగిసిన శ్రావణ మాస భజన కార్యక్రమం.
మహాదేవపూర్‌లో బీఆర్ఎస్ పార్టీ ధర్నా
మట్టి వినాయకుని పూజిద్దాం..పర్యావరణాన్ని కాపాడుదాం* - కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో మట్టి వినాయకుల తయారీపై విద్యార్థులకు అవగాహన
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే మహాశిల్పులు గురువులు.
మృతురాలి రేషన్‌ కార్డుతో రెండేళ్లుగా బియ్యం స్వాహా? - చనిపోయిన బాలమ్మ పేరుతోనే కార్డు కొనసాగింపు.