- District News
- Ranga Reddy
- ముందస్తు అరెస్టులు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు
ముందస్తు అరెస్టులు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు
ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య
ఇచ్చిన 420 హామీలను ముందుగా అమలు చేయాలి: కంచుకోట మహేష్*
Published On
By Ram Reddy
లోకల్ గైడ్
*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..* ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు, ప్రజలకు ఉంటుందని అన్నారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్యగా మారింది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ఆ హామీల అమలుపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది” అని కంచుకోట మహేష్ ఆరోపించారు.ముందుగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన తర్వాతే కొత్త హామీల గురించి మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, యువత, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని అన్నారు.10 సంవత్సరాల బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పాలన సాగించిందో, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోంది. ప్రభుత్వం మారింది కానీ ప్రజల పరిస్థితుల్లో మాత్రం ఆశించిన మార్పు కనిపించడం లేదు” అని ఆయన విమర్శించారు.ప్రతిపక్ష నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం ద్వారా ప్రజా ఉద్యమాలను అణచివేయలేరని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తీరుతామని కంచుకోట మహేష్ స్పష్టం చేశారు.ప్రజాస్వామ్య విలువలను గౌరవించి, ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కును కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని, ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ పనితీరును నిశితంగా గమనిస్తున్నారని, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేస్తున్నారు అన్నది ప్రజలకు పూర్తిగా తెలుసని గుర్తుంచుకోవాలని కంచుకోట మహేష్ అన్నారు.రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై భారతీయ జనతా పార్టీ మరింత ఉధృతంగా ప్రజా ఉద్యమాలను నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. ముందస్తు అరెస్టు లో సీనియర్ నాయకులు కరెడ్ల నరేందర్ రెడ్డి, యువ మోర్చా నాయకులు శివాజీ, రాకేష్,శివ, సందీప్,రాజు,నాయకులను అరెస్టు చేశారు
Tags:
About The Author
Related Posts
Latest News
12 Sep 2026 22:19:25
లోకల్ గైడ్ షాద్ నగర్ కేశంపేట: వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని కేశంపేట మాజీ జడ్పిటిసి విశాల...
