- District News
- విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే మహాశిల్పులు గురువులు.
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే మహాశిల్పులు గురువులు.
ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.
లోకల్ గైడ్/తాండూర్:
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే మహాశిల్పులు గురువులు అని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కొనియాడారు. శుక్రవారం తాండూర్ పట్టణంలోని తులసి గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. పెద్దేముల్ మండల పరిధిలోని వివిధ పాఠశాలల్లో విశిష్ట సేవలు అందిస్తున్న 17 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రశంస పత్రాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఉపాధ్యాయులు విద్యార్థులకు కేవలం విద్యాబోధన చేయడమే కాకుండా, వారి వ్యక్తిత్వ వికాసానికి, భవిష్యత్తు నిర్మాణానికి మార్గదర్శకులుగా నిలుస్తారని ఎమ్మెల్యే అన్నారు.
విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, సృజనాత్మకతను పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. సమాజ అభివృద్ధికి, దేశ భవిష్యత్తుకు మంచి పౌరులను తీర్చిదిద్దడంలో గురువుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను అభినందించి ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
