శివాలయం పునర్ నిర్మాణానికి 75వేల విరాళం అందజేసిన బండ్ల రాజశేఖర్ రెడ్డి

జోగులాంబ గద్వాల జిల్లా, (లోకల్ గైడ్): జిల్లా కేంద్రంలోని నల్లకుంట శివాలయం పునర్నిర్మాణంలో భాగంగా గురువారం రమ్య ఇండస్ట్రీ అధినేత బండ్ల రాజశేఖర్ రెడ్డి 75,000 వేల రూపాయలు విరాళంగా చందాను చెక్కు రూపకముగా అందజేశారని నల్లకుంటశివాలయ కమిటీ చైర్మన్ పులిపాటి వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండ్లరాజశేఖర్ రెడ్డి ఆలయ కమిటీకి గుడి నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రారంభం రోజు ఏదో రూపకంగా సహకారాలు అందిస్తానని హామీ ఇవ్వడం జరిగినదన్నారు. రాజశేఖర్ రెడ్డికు వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. నల్లకుంట శివాలయం పునర్నిర్మాణం రాతి కట్టడంతో కొనసాగుతుందన్నారు. గతంలో విరాళాలు రాసిన చందాదారులు డబ్బులు ఇవ్వనివారు ఉంటే దయచేసి నగదు రూపకంగా, బ్యాంకు చెక్కు ద్వారా గాని ఇవ్వాలని కోరారు. విరాళం ఇవ్వాలనుకున్న వారు ఆలయ కమిటీకి తెలియజేస్తే మీ ఇంటికి వచ్చి స్వీకరిస్తామన్నారు. ఈ గుడి నిర్మాణం రాతి కట్టకంతో కొనసాగుతున్నదని, ఇందులో మీరు భాగస్తులై ఆ శివుని కృప పొందగలరని కోరారు. విరాల సేకరణలో నల్లకుంట శివాలయ కమిటీ చైర్మన్ పులిపాటి వెంకటేష్, ఉపాధ్యక్షులు గుమ్మడం గోపాల్, సోనీ వెంకటేష్, అల్లంపల్లి వెంకటేష్ పాల్గొన్నారు.
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List