కొబ్బ‌రికాయ‌ను కొడితే అందులో పువ్వు వ‌చ్చిందా.. ప‌డేయ‌కుండా తినండి......

కొబ్బ‌రికాయ‌ను కొడితే అందులో పువ్వు వ‌చ్చిందా.. ప‌డేయ‌కుండా తినండి......

కొబ్బ‌రి బొండాల్లోని నీళ్లు తాగడం, పచ్చి లేదా ఎండు కొబ్బ‌రి తినడం చాలా మందికి అలవాటు. వీటితో పాటు కొబ్బ‌రి తురుము, చట్నీలు, పచ్చళ్లు, స్వీట్లు వంటివి కూడా చేస్తుంటారు. అయితే కొబ్బ‌రికాయను కొట్టినప్పుడు అందులో కనిపించే పువ్వును చాలా మంది పక్కన పెట్టేస్తారు. కానీ ఆ కొబ్బ‌రి పువ్వులో ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ పువ్వును తినడం వల్ల శరీరానికి అవసరమైన అనేక రకాల ఖనిజాలు, విటమిన్లు లభిస్తాయి.కొబ్బ‌రి పువ్వులో మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే విటమిన్లు C, B1, B2, B3, B4, B10 కూడా పుష్కలంగా ఉన్నాయి. ఫ్లేవనాయిడ్లు, పాలిఫినాల్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఈ పువ్వులో ఎక్కువే. అంతేకాకుండా, వివిధ రకాల అమైనో ఆమ్లాలు, సహజ చక్కెర, అధిక ఫైబర్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ చక్కెర రక్తంలో షుగర్ లెవెల్స్‌ను వేగంగా పెంచకపోవడం విశేషం. దాంతో డయాబెటిస్ ఉన్నవారు కూడా భయంలేకుండా కొబ్బ‌రి పువ్వును ఆహారంలో చేర్చుకోవచ్చు.

జీర్ణవ్యవస్థకు మేలు:
కొబ్బ‌రి పువ్వులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉన్న హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను నిర్మూలిస్తాయి, కణాలకు నష్టం కాకుండా కాపాడుతాయి. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇది ప్రీ-బయోటిక్ ఆహారంలా పనిచేస్తుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి, మలబద్దకం వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. విరేచన సమస్యలు, కడుపు అసౌకర్యం కూడా తగ్గుతాయి.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు, బయో యాక్టివ్ కాంపౌండ్స్ రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచుతాయి. శరీరం వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా సమర్థంగా పోరాడుతుంది. అలాగే పొటాషియం, మెగ్నీషియం రక్తప్రసరణను మెరుగ్గా ఉంచి బీపీని నియంత్రిస్తాయి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఆకలి నియంత్రణకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.

గర్భిణీలు కొబ్బ‌రి పువ్వు తింటే శిశువుకు అవసరమైన పోషకాలు అందుతాయి. ఇలా కొబ్బ‌రి పువ్వును పడేయకుండా తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Tags:

About The Author

Advertisement

Latest News

పంజాబ్ డ్రగ్స్ కేసులో విక్రమ్ సింగ్ మజీతియా అరెస్ట్! పంజాబ్ డ్రగ్స్ కేసులో విక్రమ్ సింగ్ మజీతియా అరెస్ట్!
పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన 2021 డ్రగ్స్ కేసులో శిరోమణి అకాలీదళ్ (SAD) సీనియర్ నేత, మాజీ మంత్రి విక్రమ్ సింగ్ మజీతియా అరెస్ట్‌ అయ్యారు. బుధవారం తెల్లవారుజామున...
సౌరవ్ గంగూలీ బయోపిక్‌కి రాజ్‌కుమార్ రావు ఫిక్స్! – 2026లో తెరపైకి ‘దాదా’ జీవితం
మిస్టర్ ఇండియా 2025 టైటిల్ గెలిచిన రాకేష్ ఆర్నె
‘డొక్కా సీతమ్మ’ లాంటి సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాలి : మురళీ మోహన్ 
సారీ ఫోటోషూట్‌తో ఆకట్టుకున్న నిధి
ఆరోగ్యానికి యోగామృతం
అఖిల్ ‘లెనిన్’ సినిమా నుంచి శ్రీలీల తప్పుకున్నట్టేనా?