తల్లి జన్మనిస్తే...తండ్రి భవిష్యత్తును నిర్మిస్తాడు... 

తల్లి జన్మనిస్తే...తండ్రి భవిష్యత్తును నిర్మిస్తాడు... 

ప్రతి ఏడాది జూన్ మూడవ ఆదివారం ఫాదర్స్ డే గా ప్రపంచవ్యాప్తంగా అందరూ జరుపుకుంటారు.. అయితే కన్న తల్లిదండ్రుల్లో పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో  కీలకపాత్ర పోషించేది ఎవరు? తల్లి  నవ మాసాలు మోసి జన్మనిస్తే, తండ్రి అనుక్షణం పిల్లల ఉన్నది కోసం శ్రమించే గొప్ప వ్యక్తి...అతని మౌనమైన ప్రేమ, నిరంతర త్యాగాల గురించి మనం ఆలోచించేది ఈ ప్రత్యేకమైన రోజు... తల్లి నవ మాసాలు మోసి మనకు జన్మనిస్తే... తండ్రి మాత్రం జీవితమంతా మన భవిష్యత్తు కోసం తన కలల్ని త్యాగం చేస్తాడు.
తల్లికి ప్రేమ వ్యక్తీకరణ సహజం... తండ్రికి ప్రేమ మౌనంలో వ్యక్తమవుతుంది. మాటల్లో కాదు, చేతుల్లో ఉంటుంది ఆ ప్రేమ... పిల్లల కోసం తన ఆరోగ్యాన్ని, విశ్రాంతిని, కొన్నిసార్లు తన స్వంత కోరికలను సైతం కూడా పక్కన పెట్టేసే గొప్ప వ్యక్తి తండ్రి...అలాంటి గొప్ప తండ్రిని ఈ ఒక్క రోజే కాదు నిత్యం గౌరవించిన పూజించిన తక్కువే.. కుటుంబ బాధ్యత పిల్లల భవిష్యత్తు దృష్ట్యా తండ్రి ఉదయం తొందరగా లేచి పని చేసేందుకు బయలుదేరతాడు. వర్షం కురుస్తున్నా, ఎండ కాస్తున్నా, అలసట ఉన్నా, విరామం లేదు. ఎందుకంటే అతని మనసులో ఒకే ఒక్క ఆలోచన "నా పిల్లలు నన్ను మించిన స్థాయికి చేరాలి." 
ఒకటో తరగతి మొదలుపెట్టి ఉద్యోగం వచ్చేవరకు, ప్రతి దశలో తండ్రి తలవంచి కష్టపడతాడు. స్కూల్ ఫీజు కావాలి, బుక్స్ కావాలి, డ్రెస్ కావాలి, కోచింగ్ కావాలి... పిల్లలు జీవితంలో రాణించే వరకు అనుక్షణం ముందుగా ఆలోచించేది తండ్రే... తన అవసరాలను పక్కన పెట్టి పిల్లల అవసరాలను నెరవేర్చే గొప్ప వ్యక్తి తండ్రి...
ఆత్మగౌరవం దెబ్బతినకూడదని బిడ్డలకు ఎప్పుడూ తక్కువతనం రాకూడదని నిశ్శబ్దంగా పోరాటం చేస్తాడు. తన చేతులు బద్ధలవ్వవచ్చు, గుండె లోతుల్లో కోపం, వేదన ఉండవచ్చు.. కొన్ని సందర్భాల్లో మానసిక దివ్యాంగులైనప్పటికీ కూడాను నా కొడుకు అనే ప్రేమ భావంతోనే కష్టాలు పడ్డ కూడా కొడుకు, కూతురు ఎవరైనా వారి బాగోగుల కోసం పరితపించే మహోన్నత వ్యక్తి తండ్రి...కానీ తన ముఖంపై చిరునవ్వుతో పిల్లల ముందుంటాడు.. కొన్ని సందర్భాల్లో తన ప్రేమను మనసులో ఉంచుకున్నప్పటికీ పిల్లలు తప్పు చేస్తే కోపడిన దండించిన లోలోపల దండించిన అనే బాధతో దుఃఖపడుతూ కూడా పిల్లలతో కఠినంగా వ్యవహరించడం వెనకాల పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించడమే తండ్రి గొప్ప స్థానం... అలాంటి తండ్రులకు ఫాదర్స్ డే సందర్భంగా లోకల్ గైడ్స్ తెలంగాణ జాతీయ దినపత్రిక పక్షాన శుభాభివందనాలు...

సంపాద‌కులు: న‌క్క రాకేష్

9966699062

 

 

 

Tags:

About The Author

Advertisement

Latest News

పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలి.. పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలి..
మంచిర్యాల (లోకల్ గైడ్): బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలని ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి సభని రాజేంద్రప్రసాద్ సహాయ కార్యదర్శి పసులేటి...
భూ సమస్యల పరిష్కారానికే భూభారతి రెవెన్యూ సదస్సులు
తెలంగాణలో మరో ఐదు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిక
వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో స్మృతి మంధాన అగ్రస్థానం
పాయాను త‌ర‌చూ తింటే క‌లిగే లాభాలు .......
ఇంటర్నేషనల్ యోగ డే 2025 జూన్, 21 న పతంజలి ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం
సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలి