సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో ఘోర ప్రమాదం

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో ఘోర ప్రమాదం

 – స్కూల్ ఆవరణలో పేలుడు, తొక్కిసలాటలో 29 మంది చిన్నారులు మృతి

లోక‌ల్ గైడ్,

బంగూయ్ (సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్): సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని బంగూయ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బార్తెలెమీ బోగాండా ఉన్నత పాఠశాల (Barthelemy Boganda High School) ఆవరణలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో పాఠశాలలో తొక్కిసలాట ఏర్పడి, దురదృష్టవశాత్తు 29 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటన గురువారం చోటు చేసుకోగా, అదే సమయంలో విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులు చేపడుతున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. పాఠశాల ఆవరణలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో, విద్యార్థుల్లో గందరగోళం చెలరేగి, తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది.అందులో 260 మందికిపైగా విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నారని, ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. తల్లిదండ్రులు, స్థానికులు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాసంస్థల్లో భద్రతపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలని పౌర సమాజం డిమాండ్ చేస్తోంది.

Tags:

About The Author

Latest News

శబ్ద కాలుష్యానికి కారణమైన ట్రాఫిక్ కానిస్టేబుల్ కు జరిమానా... శబ్ద కాలుష్యానికి కారణమైన ట్రాఫిక్ కానిస్టేబుల్ కు జరిమానా...
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కు ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానా పడింది....
ఫోన్ పే ద్వారా 17వేల రూపాయలకు టోకరా వేసిన కేటుగాడు...
ఫోన్ ట్యాపింగ్  కేసును సీబీఐకి  అప్పగించాల్సిందే.. లేదంటే మేమే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం... కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి...  
టాస్క్ ఫోర్స్ దాడిలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్... 
బోనాలు ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక*
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో ఘోర ప్రమాదం
ఎస్‌సీవో డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేయ‌ని రాజ్‌నాథ్ సింగ్‌