వెలివాడను చేరదీసి.. అక్షరాన్ని అక్కున చేర్చి.. 

Published On
వెలివాడను చేరదీసి.. అక్షరాన్ని అక్కున చేర్చి.. 

 కష్టజీవుల పిల్లలను అక్షరాల వైపు నడిపించిన ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"..

 ఆటోలో స్వయంగా కూర్చుని పిల్లలను పాఠశాలకు చేర్చిన ఎమ్మెల్యే శంకర్ 

 సిండికేట్ కాలనీలో దేవగిరి సంచార జాతుల పిల్లలకు భవిష్యత్తు.. 

 స్వయంగా పిల్లలను ఆటోలో తీసుకువెళ్లిన ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్".. 

 ఫరూక్ నగర్ ఎంఈఓ మనోహర్ కృషితో పేద పిల్లలకు విద్య 

లోక‌ల్ గైడ్: ఆకలితో అలమటించడం తప్ప అక్షరం నేర్చు కోవడం తెలియని పిల్లలు.. అక్షరాల వైపు తమ పిల్లలను ఎలా నడిపించాలో కూడా తెలియని తల్లిదండ్రులు.. అలాంటి కడుపు పేద జీవులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్వయంగా కలుసుకున్నారు.. తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలను బడికి చేర్చారు. స్వయంగా ఆటోలో పిల్లలతో పాటు కూర్చుని బడిదాకా ప్రయాణం చేశారు. షాద్ నగర్ పట్టణంలోని సిండికేట్ కాలనీలో సోమవారం కనిపించిన దృశ్యం ఇది. ప్రభుత్వ బడిని ప్రతి ఒక్కరికి చేరువచేసి చదువు చెప్పించాలన్నది అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం. అందులో భాగంగా గతంలో ఎన్నడూ లేనంతగా బడికిరాని పిల్లలను బడికి పంపించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కుగా నిరుపేద పిల్లలను బడికి దగ్గర చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా సిండికేట్ కాలనీలో వెలివాడ పేరిట గుడిసెలు వేసుకుని జీవిస్తున్న నిరుపేద జీవులను ఎమ్మెల్యే స్వయంగా కలుసుకున్నారు. అక్కడ బడికి రాని పిల్లలు, యాచకులుగా, పాత ఇనుప సామాన్లు, సీసాలు ఏరుకునే పిల్లలు ఉన్నారని గుర్తించారు. వారిని బడిలో చేర్పించాలన్న ఆలోచనతో తల్లిదండ్రులతో మాట్లాడి 25 మంది పిల్లలను ఆర్టీసీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో చేర్చారు. ఎంఈఓ మనోహర్ కూడా ఈ విషయంలో భాగస్వాములయ్యారు. బడికిరాని పిల్లల విషయంలో ఆయన కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం విశేషం. 

 చదువే భవిష్యత్తు.. 

చదివే ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తును ఇస్తుందని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలే ఆణిముత్యాలు గా రూపొందుతారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చదువులకు చాలా ప్రాధాన్యతనిస్తున్నామని, చిన్నపిల్లలు ఇకనుంచి పనులు చేయకుండా బడికి మాత్రమే వెళ్లేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడతామని ఆయన పేర్కొన్నారు. ఏకీకృత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల పునరుద్ధరణ వంటి కార్యక్రమాలన్నీ చదువులను బాగు చేయాలనే ఉద్దేశంతోనే చేపడుతున్నామని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు పటిష్టంగా ఉంటే మధ్యతరగతి వర్గాలు కూడా అక్కడికే వస్తారని, ఫలితంగా వారి మీద పీసులు భారం చాలావరకు తగ్గుతుందని ఎమ్మెల్యే అన్నారు. బడికిరాని పిల్లలు ఎవరు దృష్టిలో ఉన్న తనకు సమాచారం ఇస్తే బడిలో చేర్పిస్తానని ఆయన అన్నారు. నిరుపేద కుటుంబాలలో ఉండే పిల్లలు చదువుకుంటేనే వారికి భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బడిబాట కార్యక్రమానికి సహకరించిన ఎంఈఓ మనోహర్ తదితర సిబ్బందిని ఎమ్మెల్యే శంకర్ అభినందించారు..

Tags:

About The Author

Latest News

కారేపల్లి బీసీ కాలనీలో దుర్గమ్మ వైభవం.. భక్తులకు అమ్మవారి దివ్య దర్శనం! కారేపల్లి బీసీ కాలనీలో దుర్గమ్మ వైభవం.. భక్తులకు అమ్మవారి దివ్య దర్శనం!
                కారేపల్లి, అక్టోబర్ 15 (లోకల్ గైడ్ న్యూస్): కారేపల్లి మండల కేంద్రంలోని బీసీ కాలనీలో భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన
కాంగ్రెస్‌కు దోచుకోవడమే తెలుసు.. పాలన చేతకాదు!.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతిని జరపకపోవడం విచారకరం!
వికారాబాద్‌లో ఆటోమేటెడ్ ట్రాఫిక్ సిగ్నళ్ల ఏర్పాటుకై కలెక్టర్‌కు వినతిపత్రం:
ధాన్యం కొనుగోలుపై కేంద్రాల ఇన్చార్జులకు శిక్షణ
ప్రజల భద్రతకు పోలీసులతో కలిసి పనిచేయాలి
నర్సంపేటలో గోల్డ్ కంపెనీ సేల్స్‌మెన్‌కు షాక్.. రూ.5.50 లక్షలు ఎగవేత!