నర్సంపేటలో గోల్డ్ కంపెనీ సేల్స్‌మెన్‌కు షాక్.. రూ.5.50 లక్షలు ఎగవేత!

Published On
నర్సంపేటలో గోల్డ్ కంపెనీ సేల్స్‌మెన్‌కు షాక్.. రూ.5.50 లక్షలు ఎగవేత!

 

నర్సంపేట క్రైమ్, అక్టోబర్ 14 - లోకల్ గైడ్ :

నర్సంపేటలో గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ సేల్స్‌మెన్‌నే బోల్తా కొట్టించి రూ.5.50 లక్షలు ఎగవేసిన ఘటన సంచలనంగా మారింది. గుంటూరుకు చెందిన శ్రీ ఆంజనేయ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీకి చెందిన సేల్స్‌మెన్ మోసపోవడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదులోని వివరాలు..

బాధితుడి కథనం ప్రకారం.. ఏపీ గుంటూరుకు చెందిన శ్రీ ఆంజనేయ గోల్డ్ ఫైనాన్స్ సంస్థ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనుగోలు చేస్తుంటుంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్ కూడా ఇస్తోంది.

అక్టోబర్ 12న వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలానికి చెందిన బోడ శ్రీకాంత్ అనే వ్యక్తి కంపెనీని సంప్రదించాడు. తన బంగారం నర్సంపేటలోని ఫెడ్ బ్యాంకులో తాకట్టులో ఉందని, వేలానికి వచ్చిందని, డబ్బు కడితే విడుదలవుతుందని నమ్మించాడు. దీంతో కంపెనీ యాజమాన్యం నిజమని నమ్మి బ్యాంకు స్లిప్పులు, ఆధార్ కార్డు చెక్ చేసి సేల్స్‌మెన్‌ను నర్సంపేటకు పంపింది.

అక్టోబర్ 13 ఉదయం 11 గంటలకు నర్సంపేట బస్టాండ్‌కు వచ్చిన సేల్స్‌మెన్‌ను అంగడి రోడ్‌లోని సెంట్రల్ బ్యాంక్ వద్దకు తీసుకెళ్లాడు శ్రీకాంత్. అక్కడ తన ఖాతాలో డబ్బు వేస్తే బంగారం విడుదలవుతుందని నమ్మించాడు.

దీంతో సేల్స్‌మెన్ కంపెనీ నుండి రూ.5 లక్షలు, తన సొంత ఫోన్‌పే నుండి రూ.50 వేలు కలిపి మొత్తం రూ.5.50 లక్షలు శ్రీకాంత్ ఖాతాలోకి బదిలీ చేశాడు.

డబ్బు పడగానే ఉడాయించాడు..

డబ్బు పడిన వెంటనే "బ్యాంకులోకి వెళ్లి బంగారం తెస్తా, ఇక్కడే ఉండు" అని సేల్స్‌మెన్‌ను బయట కూర్చోబెట్టి లోపలికి వెళ్లినట్లు నటించి అక్కడి నుండి పరారయ్యాడు. ఫోన్ చేస్తే "వస్తున్నా" అంటూ గంటల తరబడి తిప్పించుకుంటూ ఖాతాలోని డబ్బు మొత్తం ఖాళీ చేసి చివరకు ఫోన్ స్విచాఫ్ చేశాడు.
మోసపోయినట్లు గ్రహించిన సేల్స్‌మెన్ నర్సంపేట పోలీసులనుఆశ్రయించాడు
ప్రస్తుతం బాధిత సేల్స్‌మెన్ డబ్బులు పోగొట్టుకుని, గుంటూరు వెళ్లలేక నర్సంపేటలోనే ఉండిపోయాడు.

Tags:

About The Author

Latest News

నర్సంపేటలో గోల్డ్ కంపెనీ సేల్స్‌మెన్‌కు షాక్.. రూ.5.50 లక్షలు ఎగవేత! నర్సంపేటలో గోల్డ్ కంపెనీ సేల్స్‌మెన్‌కు షాక్.. రూ.5.50 లక్షలు ఎగవేత!
    నర్సంపేట క్రైమ్, అక్టోబర్ 14 - లోకల్ గైడ్ : నర్సంపేటలో గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ సేల్స్‌మెన్‌నే బోల్తా కొట్టించి రూ.5.50 లక్షలు ఎగవేసిన ఘటన
వికారాబాద్ జిల్లాలో బార్ల కేటాయింపునకు  (అక్టోబర్ 16న) లాటరీ
కోటమైసమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు!
మంగలి తండాలో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ ఉక్కుపాదం!
అర్హత కల్గిన ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు కల్పించడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం.
పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలి.
గ్రామ అభివృద్ధి శిలాపలకాలపై వార్డు మెంబర్ ల పేర్లు నమోదు చేయాలి.