- District News
- అక్షర స్కూల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
అక్షర స్కూల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
తుర్కపల్లి, ఆగస్టు 15: అక్షర అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ జంగిటి శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించగా, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి, మంచి పౌరులుగా ఎదిగి దేశ సేవ చేయాలి” అని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని సూచించారు.
వేడుకల్లో భాగంగా విద్యార్థులు దేశభక్తి గీతాలు, నృత్యాలు, ఉపన్యాసాలతో ఆకట్టుకున్నారు. క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కరెస్పాండెంట్ శ్రీనివాస్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు సంతోష్ కుమార్, బింగి క్రిష్ణ, ఉపాధ్యాయినులు సంతోషి, రాధ, రామలీల, లత, ఉష శ్రీ, శ్రావణి, సంగీత, సుప్రియ, శిరీషతో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
