- District News
- ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
త్రివర్ణ పతాకాన్ని* ఆవిష్కరించిన తెలంగాణ. రాష్ట్రశాసనసభ పతి గడ్డం. ప్రసాద్ కుమార్
Published On
By Ram Reddy
లోకల్ గైడ్, :
రాష్ట్ర శాసన సభా పతి గడ్డం ప్రసాద్ కుమార్, విచ్చేసి జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్ పి స్నేహ మెహర గార్లతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. పుర ప్రముఖులను, అధికార అనధికారులను కలిసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రగతిని నివేదిస్తూ, ప్రజనుద్దేశించి ప్రసంగించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, ,పశు సంవర్ధక,ఉద్యాన వన శాఖ,అటవీ, విద్యా, వైద్యారోగ్య, ఇందిరమ్మ ఇండ్లు,మహిళా శిశు సంక్షేమం, మిషన్ భగీరథ,రోడ్డు రవాణా సంస్థ,ట్రాన్స్ పోర్ట్ తదితర శాఖల స్టాల్స్ ను సందర్శించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు బహూకరించారు. పోలీసులకు ప్రశాంషా పత్రాలు బహూకరించారు.
ఈ సందర్బంగా మహిళా సంఘాలకు రూ . 179,18,32,000 వడ్డీ లేని రుణాలు చెక్ అందజేశారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుక సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులు, చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరింపజేశాయి. దేశ భక్తి ఉట్టి పడేలా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఆహుతుల మన్ననలు అందుకున్నారు.కే జి బి వి వికారాబాద్, ,సంగం లక్ష్మి బాయి ,జవహర్ లాల్ బాల కేంద్రం , జాడ్ పి ఎచ్ ఎస్ గర్ల్స్, టి ఎస్ డబ్ల్యు ఆర్ ఎస్, బాయ్స్, అనంతగిరి పల్లి, ట్రైబల్ వెల్ఫేర్, మహాత్మా జ్యోతి బాపులే బాలికల పాఠశాల, విద్యార్థినులు, చిన్నారులు సాంస్కృతిక గేయాలపై చక్కటి అభినయం ప్రదర్శించారు.
ఈ సందర్భంగా చిన్నారులను ముఖ్య అతిథి ప్రసాద్ కుమార్ , ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించి జ్ఞాపికలను అందజేశారు.ఈ వేడుకల్లోఅదనపు కలెక్టర్ లు ఉమా శంకర్ ప్రసాద్, వెంకటాచారి ఎమ్మెల్యే రామ్ మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గడ్డం అనన్య, ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టుర్ , అటవీ శాఖా అధికారి ,ఎస్ ఎఫ్ సి రంగ రాజు, ఆర్డీఓ వాసు చంద్ర, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది,ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
29 Aug 2026 11:02:31
ఆగస్టు 29(లోకల్ గైడ్) హైదరాబాద్‌లోని బండ్లగూడ జగీర్‌కు చెందిన 49 ఏళ్ల సర్జన్‌ను ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు దారుణంగా మోసగించారు. జులై 2025లో
