డిసెంబర్ 9న హైదరాబాద్‌లో ఆదివాసీ జన గర్జన సభను విజయవంతం చేయాలి

లక్షలాది మంది ఆదివాసీలతో భారీ బహిరంగ సభ నిర్వహణకు తుడుం దెబ్బ పిలుపు

Published On
డిసెంబర్ 9న హైదరాబాద్‌లో ఆదివాసీ జన గర్జన సభను విజయవంతం చేయాలి

 

 

మణుగూరు లోకల్ గైడ్ న్యూస్ :

డిసెంబర్ 9న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఆదివాసీ భారీ బహిరంగ సభను లక్షలాది మంది ఆదివాసీలు తరలివచ్చి విజయవంతం చేయాలని తుడుం దెబ్బ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం మణుగూరు మండల కేంద్రంలోని గిరిజన భవన్‌లో తుడుం దెబ్బ నూతన మండల కమిటీ సమావేశం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి పోలబోయిన వెంకట్ నారాయణ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి పద్దం శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ నాయకత్వంలో ఆదివాసీల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం బలమైన డిమాండ్లతో హైదరాబాద్ నడిబొడ్డున భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. గూడాల నుంచి నిరుద్యోగ యువత, మహిళలు, ఉద్యమ నాయకులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆదివాసీల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించి, డిసెంబర్ 9న హైదరాబాద్‌లో ఆదివాసీ ఐక్యతా శక్తిని చాటాలని నాయకులు కోరారు.

Tags:

About The Author

Latest News

గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి
    మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) లక్షెట్టిపేట మండలం సూరారం రాష్ట్ర రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని సూరారం గ్రామానికి చెందిన చెల్లా చరణ్
రాజేంద్రనగర్‌లో బిఆర్‌ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు
కార్తీక పౌర్ణమికి బుగ్గ దేవాలయంలో జ్వాల తోరణం..
ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
షాద్‌నగర్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
నియోజవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు
పేదల ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇల్లు…. రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి