- District News
- Khammam
- నూతన దంపతులకు బానోత్ సుందర్‌లాల్ ఆత్మీయ ఆశీస్సులు!
నూతన దంపతులకు బానోత్ సుందర్‌లాల్ ఆత్మీయ ఆశీస్సులు!
గేట్ కారేపల్లిలో చెరుకూరి నరసయ్య–పుష్పవతి దంపతుల కుమారుడు నరేందర్ వివాహ వేడుకకు హాజరైన బీఆర్‌ఎస్ నాయకులు
కారేపల్లి, నవంబర్ 5 (లోకల్ గైడ్ న్యూస్):
కారేపల్లి మండలం గేట్ కారేపల్లికి చెందిన చెరుకూరి నరసయ్య, పుష్పవతి దంపతుల కుమారుడు నరేందర్ వివాహం హేమశ్రీ సాయితో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు వైరా నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు బానోత్ సుందర్‌లాల్ హాజరై నూతన వధూవరులు నరేందర్, హేమశ్రీ సాయిలను ఆత్మీయంగా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి వైవాహిక జీవితం నిండు నూరేళ్ల పాటు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.
వివాహ వేడుకలో బానోత్ సుందర్‌లాల్ ఆత్మీయంగా పాల్గొని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు హనుమకొండ రమేష్, గేట్ కారేపల్లి ఉపసర్పంచ్ కందుల శ్రీనివాసరావు (సామెల్), సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా నాయకుడు భూక్యా శివ నాయక్, కారేపల్లి మండల మహా రిపోర్టర్ బాదావత్ రాము నాయక్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
