ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి దీపావళి వేడుకలు నిర్వహించిన కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య

Published On
ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

 

 

రంగారెడ్డి జిల్లా బ్యూరో, ( లోకల్ గైడ్ ):                    

     రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు” కార్యక్రమంలో భాగంగా ఆదివారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్యతో కలిసి మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన ఆండాలు, రాగిచెట్టు భాస్కర్ ఇళ్లలో నిర్వహించిన దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యేలు లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు కాల్చి దీపావళి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి పండుగ ఆనందాన్ని పంచుకుంటూ వారి సంతోషంలో భాగస్వాములయ్యారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తమ ఇళ్లకు వచ్చి పండుగ వేడుకల్లో పాల్గొనడంతో లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

IMG-20261108-WA0204IMG-20261108-WA0200IMG-20261108-WA0202

రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు. సొంత ఇల్లు ప్రతి కుటుంబానికి ఆత్మగౌరవం, భద్రత, భరోసాను కల్పిస్తుందని పేర్కొన్నారు. అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో దీపావళి వేడుకలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా పేద కుటుంబాల్లో వెలుగులు నింపడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అన్నారు. ప్రతి లబ్ధిదారుడు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఇంటి నిర్మాణాన్ని నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసుకోవాలని సూచించారు. 
జిల్లాలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి దీపావళి సంబరాలలో పాలుపంచుకుంటున్నారని తెలిపారు.
ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో దీపావళి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్బంగా చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. గతంలో సొంత ఇల్లు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు ఎంతో భరోసానిస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని, ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. పేదల ఇళ్లలో దీపావళి సంబరాలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వం వారి కుటుంబాల్లో పండుగ ఆనందాన్ని మరింత పెంచిందన్నారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సంతోషాల్లో భాగస్వాములు కావడం ఎంతో ఆనందంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధికి నిరంతరం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొనడంతో పాటు ప్రభుత్వం తమకు అండగా ఉందనే భరోసా కలిగిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చేవెళ్ళ ఆర్డీఓ పార్థసింహారెడ్డి, పిడి హౌసింగ్  డి.చాంప్లా నాయక్, మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్ కుమార్, గ్రామ సర్పంచ్ దివ్య మురళీధర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
        రంగారెడ్డి జిల్లా బ్యూరో, ( లోకల్ గైడ్ ):                          రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు” కార్యక్రమంలో భాగంగా ఆదివారం
షాద్‌నగర్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
నియోజవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు
పేదల ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇల్లు…. రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పుట్టినరోజు సందర్భంగా  కరీంనగర్ పట్టణంలోని కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి చల్ల ప్యాకెట్లు పంపిణీ చేశారు. 
అంబేద్కర్ విగ్రహం వద్ద క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచాలి 
చర్లలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు