సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి.

విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత, పొదుపుపై అవగాహన.

Published On
సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి.

లోకల్ గైడ్/బంట్వారం:
బంట్వారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో ప్రిన్సిపల్ బ్యూలా ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్‌ నేరాలు, ఆర్థిక అక్షరాస్యత, పొదుపు అలవాట్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బంట్వారం యూనియన్ బ్యాంక్ మేనేజర్ రాజేష్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, పిన్ నంబర్లను ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. చిన్నతనం నుంచే పొదుపు అలవాటు చేసుకోవడంతో పాటు డబ్బు విలువ, ఆర్థిక క్రమశిక్షణను అలవరచుకోవాలని వివరించారు. పిగ్గీ బ్యాంక్ ద్వారా చిన్న మొత్తాల్లోనూ పొదుపు చేయవచ్చని తెలియజేస్తూ విద్యార్థులకు ఆర్థిక అవగాహన కల్పించారు.

Tags:

About The Author

Latest News

సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి. సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి.
లోకల్ గైడ్/బంట్వారం:బంట్వారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో ప్రిన్సిపల్ బ్యూలా ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్‌ నేరాలు, ఆర్థిక అక్షరాస్యత, పొదుపు అలవాట్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు....
భక్తిశ్రద్ధలతో మహా రుద్రాభిషేకం.
బహుజన సభను విజయవంతం చేయాలి
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలి
హిమాయత్ సాగర్ వద్ద ఎంఐఎం నాయకుడు ముర్తుజ పైల్వాన్ దారుణ హత్య. 
కెవీసీఎస్‌లో ఘనంగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ డే.
తాండూరులో అంబరాన్నంటిన సదర్ ఉత్సవాలు.