బహుజన సభను విజయవంతం చేయాలి

రాజ్యాంగ దినోత్సవ సభ పోస్టర్లను ఆవిష్కరించిన డీసీసీ వైస్ ప్రెసిడెంట్ మైలారం ప్రదీప్ కుమార్ (టక్కు)

Published On
బహుజన సభను విజయవంతం చేయాలి

 

గండిపేట, నవంబర్ 24 లోకల్ గైడ్:

నవంబర్ 26న బహుజన్ సేనా ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాజ్యాంగ దినోత్సవ సభకు బహుజనులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని డీసీసీ వైస్ ప్రెసిడెంట్ మైలారం ప్రదీప్ కుమార్ (టక్కు) పిలుపునిచ్చారు.

మంగళవారం తన కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ సభకు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయం వంటి అంశాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.

ఈ నెల 26న నిర్వహించనున్న సభకు బహుజనులందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నాయకులు మంగళారం నరేందర్,బక్కని సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News