భక్తిశ్రద్ధలతో మహా రుద్రాభిషేకం.

ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి - ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సత్కరించిన గోశాల కమిటీ సభ్యులు

ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రముఖ వ్యాపారవేత్త శంకర్ యాదవ్
Published On
భక్తిశ్రద్ధలతో మహా రుద్రాభిషేకం.


లోకల్ గైడ్/తాండూరు

తాండూరు పట్టణంలోని గోశాల ఆధ్వర్యంలో సోమవారం మహా రుద్రాభిషేకం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ చీఫ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గోశాల కమిటీ సభ్యులు వారికి ఘనంగా స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు.

అనంతరం గోశాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త శంకర్ యాదవ్  గోశాలలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... తాండూరు ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. మహా రుద్రాభిషేకం కార్యక్రమం భక్తిమయ వాతావరణంలో కొనసాగగా, భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు, పట్టణ ప్రముఖులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News