- District News
- వ్యవసాయ బావిలో యువకుడి మృతదేహం.
వ్యవసాయ బావిలో యువకుడి మృతదేహం.
Published On
By Ram Reddy
వికారాబాద్ జిల్లా బంట్వారం మండలంలోని బొపునారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బేగరి శివకుమార్ (23) గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో మృతదేహంగా కనిపించాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ నెల 20న ఇంటి నుంచి వెళ్లిపోయిన శివకుమార్, ఐదు రోజుల అనంతరం బుధవారం ఉదయం 7 గంటల సమయంలో వర్రె బాల్‌రెడ్డికి చెందిన వ్యవసాయ బావిలో శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న బంట్వారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో పాటు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. శివకుమార్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Tags:
About The Author
Related Posts
Latest News
25 Nov 2026 20:31:12
లోకల్ గైడ్/బంట్వారం:వికారాబాద్ జిల్లా బంట్వారం మండలంలోని బొపునారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బేగరి శివకుమార్ (23) గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో మృతదేహంగా
