- District News
- కాగ్నా నదిలో ఇసుక తవ్వకాలకు మరో ప్రాణం బలి!
కాగ్నా నదిలో ఇసుక తవ్వకాలకు మరో ప్రాణం బలి!
- కిష్టప్ప మృతికి ప్రభుత్వ, అధికారుల నిర్లక్ష్యమే కారణం - బీజేపీ జిల్లా అధ్యక్షుడు యు. రమేష్ కుమార్
లోకల్ గైడ్/తాండూరు:
కాగ్నా నదిలో అక్రమ ఇసుక తవ్వకాల కారణంగా గుంతలు ఏర్పడి విశ్వనాథ్‌పూర్ గ్రామానికి చెందిన కిష్టప్ప (40) మృతి చెందడంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు యు. రమేష్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన సంఘటన స్థలాన్ని సందర్శించిన బాధితులకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలని గతంలో పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎనిమిది నెలల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాండూరులోని ఇసుక సంపదను కొడంగల్‌కు తరలిస్తుంటే స్థానిక ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన కాంట్రాక్టర్లు, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు బంటారం భద్రేశ్వర్, యాలాల మండల అధ్యక్షుడు వెంకటేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొని మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపారు.
