బీఎస్పీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కట్టెల మల్లేశం

ఏకగ్రీవంగా ఎన్నిక; నియామక పత్రం అందించిన రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్

బహుజనుల బతుకులు మారాలంటే రాజ్యాధికారమే ఏకైక మార్గం: ఇబ్రాం శేఖర్
Published On
బీఎస్పీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కట్టెల మల్లేశం

IMG-20260930-WA0245

లోకల్ గైడ్ /వికారాబాద్:

బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కట్టెల మల్లేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం రాష్ట్ర కార్యాలయంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఇబ్రాం శేఖర్ మాట్లాడుతూ, దశాబ్దాలుగా పాలన సాగిస్తున్న సంప్రదాయ పార్టీలు బహుజనులను (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను) కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయని మండిపడ్డారు. అసలైన రాజ్యాధికారం దక్కినప్పుడే అట్టడుగు వర్గాల బతుకులు మారుతాయని స్పష్టం చేశారు. ఓటును కేవలం హక్కుగానే కాకుండా, పాలకులను మార్చే పదునైన ఆయుధంగా మలచుకోవాలని పిలుపునిచ్చారు.
ఓటును అమ్ముకోవడం అంటే మనల్ని మనం అమ్ముకోవడమే
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ద్వారానే ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు లభించిందని, ఆ ఓటే దేశ గతిని మార్చే ఏకైక శక్తి అని శేఖర్ ఉద్ఘాటించారు. "ఓటును అమ్ముకోవడం అంటే మనల్ని మనం అమ్ముకోవడమే" అని పేర్కొన్నారు. మాన్యువల్ కాన్షీరామ్, కుమారి మాయావతిల సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ, బీఎస్పీ బహుజనులకు ఆత్మగౌరవాన్ని అందిస్తోందన్నారు. జనాభా ప్రాతిపదికన ప్రతి వర్గానికి సంపదలో, పదవులలో సముచిత స్థానం దక్కాలని, విద్య, వైద్యం, ఉపాధి రంగాలలో మార్పు తీసుకురావడమే తమ లక్ష్యమని వివరించారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి అందించిన సుపరిపాలన తరహాలోనే తెలంగాణ గడ్డపై కూడా బహుజనుల రాజ్యం సాధించడమే ధ్యేయమని తెలిపారు.
జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి: కట్టెల మల్లేశం
తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష పదవిని అప్పగించినందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కట్టెల మల్లేశం కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి, వికారాబాద్ జిల్లా నుండి ప్రజాప్రతినిధులను చట్టసభలకుంపేలా శ్రమిస్తానని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేందర్, 4వ జోన్ ఇంచార్జ్ అంతటి నాగన్న, చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జ్ సయ్యద్ అమీర్, జిల్లా ఉపాధ్యక్షుడు చెట్టుకింద ఇసువప్ప, కొడంగల్ నియోజకవర్గ ఇంచార్జ్ యు.రమేష్ బాబు, అధ్యక్షుడు శ్రీనివాస్, వికారాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ జనార్ధన్, అధ్యక్షుడు మహేందర్, అంబేద్కర్ ప్రజా సంఘం తాండూర్ డివిజన్ కార్యదర్శి బుడగ జంగం వెంకటేష్, కొడంగల్ పట్టణ అధ్యక్షుడు దస్తప్ప, సీనియర్ నాయకుడు డప్పు పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గోవిందుతండాలో వైభవంగా బాల త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణ గోవిందుతండాలో వైభవంగా బాల త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణ
        కారేపల్లి, అక్టోబర్ 11 (లోకల్ గైడ్ న్యూస్): దసరా పండుగను పురస్కరించుకుని శరన్నవరాత్రుల సందర్భంగా కారేపల్లి మండలం గోవిందుతండా గ్రామంలో శ్రీ బాల త్రిపుర సుందరి
ఆడబిడ్డలతో కలిసి బతుకమ్మ ఆడి, పాడిన మంత్రి సీతక్క
ఎంప్లాయిస్ యూనియన్ కూటమిని గెలిపించిన ఆర్టీసీ కార్మికులకు అభినందనలు
అమెరికాసామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి.
ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈయూ' కూటమి ఘన విజయం
సి సి రోడ్డు శంకుస్థాపన చేసిన సర్పంచ్ ఖమ్మంపాటి స్వాతి జగన్  
సర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి.