సోషల్‌ మీడియా వారియర్స్‌దే కీలక భూమిక..!

ప్రతిపక్షాల తప్పుడు ప్రచారానికి  ధీటైన సమాధానం ఇవ్వాలి. కేసులకు భయపడొద్దు... ప్రతి కార్యకర్తకు  అండగా ఉంటాం.

నేడు కలెక్టరేట్ ముందు కాంగ్రేస్ నిరసన... --- డీసీసీ అధ్యక్షులు  శివసేన రెడ్డి.
Published On
సోషల్‌ మీడియా వారియర్స్‌దే కీలక భూమిక..!

IMG-20260927-WA0219వనపర్తి లోకల్ గైడ్ ప్రతినిధి సెప్టెంబర్ 27 :


  కాంగ్రెస్‌ పార్టీ బలోపేతంలో సోషల్‌ మీడియా వారియర్స్‌ కీలక భూమిక పోషించాలని డీసీసీ అధ్యక్షులు శివసేన రెడ్డి పిలుపునిచ్చారు.  ఆదివారం వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ  కార్యాలయంలో సోషల్ మీడియా కోఆర్డినేటర్ సమావేశంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి, శివసేనారెడ్డిలు పాల్గన్నారు.  ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ  సామాజిక మాధ్యమాల్లో ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారానికి వాస్తవాలు, గణాంకాలతో ధీటైన సమాధానం ఇవ్వాలని  ఆయన సూచించారు. పార్టీ కోసం సోషల్‌ మీడియా వేదికగా పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని,  కేసులు, బెదిరింపులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పులు, ఆర్థిక భారాల మధ్య కూడా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.  కాంగ్రెస్‌ పార్టీ  పేదలు, రైతులు, నిరుద్యోగులు, బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో ఆర్థిక, సామాజిక సంస్కరణలు  చేపట్టిందన్నారు. అలాగే రాష్ట్ర అభివృద్ధి పథంలో నడుస్తున్న పరిస్థితులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సోషల్‌ మీడియా వారియర్స్‌పై ఉందన్నారు. సోషల్‌ మీడియా, ఇతర సామాజిక మాధ్యమాలు అందుబాటులో లేని సమయంలో ప్రజలను చైతన్యవంతం చేయడంలో పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియా కీలక భూమిక పోషించాయన్నారు.  ఆయా సందర్భాల్లో రాజకీయ పార్టీల విధానాలు, ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజా సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా తనదైన పాత్ర పోషించిందన్నారు. అప్పట్లో పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా ప్రజలకు సమాచారం చేరితే, ప్రస్తుతం సోషల్‌ మీడియా ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న శక్తివంతమైన వేదికగా మారిందన్నారు.
ముఖ్యంగా జెన్‌ జీకి సోషల్‌ మీడియా ప్రధాన వేదికగా నిలుస్తోందని, యువత ఎక్కువగా సామాజిక మాధ్యమాల ద్వారానే సమాచారం తెలుసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు సోషల్‌ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో సులభమైన భాషలో వివరించాలన్నారు.ప్రతిపక్షాలకు సమాధానం ఇచ్చే క్రమంలో కులం, మతం వంటి అంశాలను ప్రస్తావించకుండా కేవలం సబ్జెక్ట్‌ ఆధారంగా, వాస్తవాలు–గణాంకాలతో పోస్టులు రూపొందించాలని సూచించారు.  ప్రతి సోషల్‌ మీడియా వారియర్‌ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పార్టీ విధానాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసే సోషల్‌ మీడియా కార్యకర్తలకు పూర్తి సహకారం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. గ్రామ,మండల,పట్టణ, జిల్లా స్థాయిలో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు  అన్నీటిని షేర్ చేసేందుకు  బాధ్యత తీలుకోవాలన్నారు. అనంతరం సేవాదళ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  ఎమ్మెల్యే మేఘారెడ్డి, శివసేనారెడ్డిలు జాతీయ జెండాను ఎగరవేశారు. 

--- నేడు కలెక్టరేట్ ముందు కాంగ్రేస్ నిరసన ....

 ఓట్ల చోరీ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం  వనపర్తి  కలెక్టరేట్‌ ముందు కాంగ్రెస్‌ పార్టీ  ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న ట్లు  డీసీసీ అధ్యక్షులు శివసేన రెడ్డి  తెలిపారు. ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో చేపట్టనున్న నిరసనల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన  తెలిపారు.  టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆదేశాల మేరకు ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన  పిలుపునిచ్చారు.

Tags:

About The Author

Latest News