అభివృద్ధిని చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలు...

కాంగ్రెస్ నాయకులు మంటు గంజాయి బ్యాచుల ప్రచారం..

గంజాయి వర్గానికి వెళ్లిన వారికి రాజకీయ భిక్ష పెట్టిందే పిఎస్ఆర్. 
Published On
అభివృద్ధిని చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలు...

 

 

 

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

IMG-20261023-WA0288

మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్ రావు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మంచిర్యాల మేయర్ దర్ని మధుకర్ అన్నారు.శుక్రవారం రాత్రి లక్షెట్టిపేట్ పట్టణంలోని ఐబీ గెస్ట్ హౌస్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.ఆర్ టి ఎ మెంబర్ అంకతి శ్రీనివాస్ ను కిడ్నాప్ చేసిన నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని,మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ లో వర్గాలను సృష్టిస్తు నాయకులపై దాడి చేయడం సమంజసం కాదని అన్నారు.ఎమ్మెల్యే పిఎస్ఆర్ మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే అసూయపడి మంచిర్యాలలో తీవ్ర అలజడులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.గంజాయి చెట్టు నీడన చేరి కాంగ్రెస్ నాయకులమంటు చెప్పుకుంటు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని,ప్రజా నాయకుడు తమ ఎమ్మెల్యేను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.ప్రజాబలం ముందు గంజాయి బలం నిలవదని ఆ బ్యాచ్ గుర్తించాలని సూచించారు.మరోసారి తమ ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.అదేవిదంగా మంచిర్యాల జిల్లా ఆర్ జి పి ఆర్ ఎస్ అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి మాట్లాడుతు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసిన నాయకుడే ఎమ్మెల్యే అని,తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి తమ నాయకుడు పిఎస్ఆర్ కృషి ఎంతో ఉందని అన్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులను కిడ్నాప్ చేసి ఏదో సాధించామని గొప్పలు చెప్పుకుంటున్నారని,తమ ఎమ్మెల్యే సైనికుల ముందు ఇలాంటి పిచ్చి వేషాలు నడవవు అని అన్నారు.అదేవిదంగా జెండా వెంకటాపూర్ సింగల్ విండో చైర్మన్ చల్లా నాగభూషణం మాట్లాడుతు మంచిర్యాల నియోజకవర్గంలో ఎన్ని వర్గాలు ఏర్పడ్డ మంచిర్యాల ప్రజలు మాత్రం ఎమ్మెల్యేతోనే ఉంటారని,గంజాయి వర్గానికి వెళ్లిన వారికి రాజకీయ భిక్ష పెట్టిందే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అని,ఇంకోసారి ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు.మంచిర్యాల ఆర్ టి ఎ మెంబర్ అంకతి శ్రీనివాస్ మాట్లాడుతు స్నేహం పేరుతో కొందరు వ్యక్తులు దసరా పండుగ వేళ తనకు మద్యం తాగించి కిడ్నాప్ చేశారని,తనను ఇందారం వరకు ఒక కారులో మళ్లీ ఇందారం నుండి వేరే కారులో మాజీ నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సురిమిల్ల వేణు,మాజీ కౌన్సిలర్ వేములపల్లి సంజీవ్,శ్రీరాంపూర్ కి చెందిన సతీశ్వర్ రెడ్డి అను వ్యక్తులు హైదరాబాద్ వైపు తీసుకెళ్తుండగా హైదరాబాద్ శివారులో కారు నుండి తప్పించుకొని తమ ఎమ్మేల్యేకు సమాచారం అందించడంతో తనను ఎమ్మెల్యే రక్షించారని,తన ఊపిరి ఉన్నంతవరకు,కట్టే కాలే వరకు ఎమ్మెల్యే వెంటనే ఉంటానని తెలిపారు.తాను ప్రలోభాలకు లొంగే వ్యక్తిని కాను అని,తనను కిడ్నాప్ చేసిన వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.అనంతరం ఐబీ గెస్ట్ హౌస్ వద్ద నుండి బైక్ ర్యాలీతో లక్షెట్టిపేట్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి అంకతి శ్రీనివాస్ ను కిడ్నాప్ చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన నిందుతులపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసారు.ఈ సమావేశంలో పలువురు కార్పొరేటర్లు,కౌన్సిలర్లు,మార్కెట్ చైర్మన్ లు,సింగిల్ విండో చైర్మన్లు,సర్పంచులు,ఉప సర్పంచ్లు,మండలాల అధ్యక్షులు,వార్డు మెంబర్లు డైరెక్టర్లు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Tags:

About The Author

Latest News