- District News
- పాఠశాలల అభివృద్ధికి రూ.9 లక్షలు మంజూరు.
పాఠశాలల అభివృద్ధికి రూ.9 లక్షలు మంజూరు.
ప్రహరీ గోడ నిర్మాణం, మరమ్మతులకు నిధుల కేటాయింపు - పనులను ప్రారంభించిన సర్పంచ్ నర్సమ్మ.
లోకల్ గైడ్ /తాండూరు:
తాండూరు మండలం చెంగోల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం రూ.9 లక్షల నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా ప్రాథమికోన్నత పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.7 లక్షలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ మరమ్మతులకు రూ.2 లక్షలు కేటాయించారు. విద్యార్థుల భద్రత, పాఠశాల ప్రాంగణ రక్షణకు ఈ పనులు దోహదపడనున్నాయి.
శుక్రవారం గ్రామ సర్పంచ్ నర్సమ్మ ఈ అభివృద్ధి పనులను ప్రారంభించారు. పాఠశాలల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడంలో సహకరించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి గ్రామ ప్రజల తరఫున సర్పంచ్ నర్సమ్మ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అనిత, వార్డు సభ్యులు గోపాల్, రాములు, పంచాయతీ కార్యదర్శి అశోక్ కుమార్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కిష్టప్ప, ఎల్లమ్మ, వెంకటేష్, విజయ్, మంజుల, నాగేశం, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
