హకీంపేట్‌లో వ్యవసాయ అనుబంధ శాఖల ఎక్స్‌పో ఏర్పాట్ల పరిశీలన..

కొడంగల్ నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణ పనుల తనిఖీ

Published On
హకీంపేట్‌లో వ్యవసాయ అనుబంధ శాఖల ఎక్స్‌పో ఏర్పాట్ల పరిశీలన..

 

 

లోకల్ గైడ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి / కొడంగల్:

హకీంపేట్‌లో త్వరలో జరగనున్న వ్యవసాయ అనుబంధ శాఖల ఎక్స్‌పో ఏర్పాట్లను ఉన్నతాధికారుIMG-20261013-WA0268లు పరిశీలించారు. అదేవిధంగా కొడంగల్‌లో నిర్మాణ దశలో ఉన్న నూతన పోలీస్ స్టేషన్ భవన పనులను జిల్లా ఎస్పీ తనిఖీ చేశారు.
ఎక్స్‌పో ఏర్పాట్ల పరిశీలన
హకీంపేట్‌లో ఘనంగా నిర్వహించనున్న వ్యవసాయ అనుబంధ శాఖల ఎక్స్‌పో వేదికతో పాటు ఇతర ఏర్పాట్లను అగ్రికల్చర్ ప్లానింగ్ కమిషన్ సెక్రటరీ శ్రీ సురేంద్ర మోహన్ (ఐఏఎస్ ), జిల్లా కలెక్టర్ శ్రీ దీపక్ తివారి (ఐఏఎస్ ), జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా (ఐపీస్ ) తదితర సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎక్స్‌పోకు విచ్చేసే రైతులు, ప్రజలు మరియు వివిధ శాఖల ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా కార్యక్రమానికి వచ్చే ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చేపట్టాల్సిన ట్రాఫిక్ మళ్లింపులు, వాహనాల పార్కింగ్ వసతులు మరియు పటిష్టమైన భద్రతా చర్యలపై పోలీస్ శాఖ తీసుకోవాల్సిన విధివిధానాలపై చర్చించి తగిన సూచనలు చేశారు.
కొడంగల్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనుల పరిశీలన
ఎక్స్‌పో ఏర్పాట్ల పరిశీలన అనంతరం జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా (ఐపీస్ ) కొడంగల్‌లో నిర్మాణ దశలో ఉన్న నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా భవన నిర్మాణ పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై సంబంధిత కాంట్రాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం భవనం ఏ దశలో ఉంది, ఇంకా ఏయే పనులు మిగిలి ఉన్నాయి అనే అంశాలపై ఆరా తీశారు. నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

Tags:

About The Author

Latest News

హకీంపేట్‌లో వ్యవసాయ అనుబంధ శాఖల ఎక్స్‌పో ఏర్పాట్ల పరిశీలన.. హకీంపేట్‌లో వ్యవసాయ అనుబంధ శాఖల ఎక్స్‌పో ఏర్పాట్ల పరిశీలన..
        లోకల్ గైడ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి / కొడంగల్: హకీంపేట్‌లో త్వరలో జరగనున్న వ్యవసాయ అనుబంధ శాఖల ఎక్స్‌పో ఏర్పాట్లను ఉన్నతాధికారులు పరిశీలించారు. అదేవిధంగా కొడంగల్‌లో
ఐటీసీ నుంచి భద్రాచలం బ్రిడ్జి వరకు రహదారి సుందరీకరణకు వారం రోజుల్లో ప్రణాళిక
ధారూర్ నూతన ఎస్‌ఐగా సురేష్ బాధ్యతల స్వీకరణ
ఎస్సై, పోలీస్ ఉచిత శిక్షణకు 100 మంది గిరిజన అభ్యర్థుల ఎంపిక
పేదల జీవితాలకు కొత్త వెలుగు.. డాక్టర్ బాదావత్ రవి సేవా సంకల్పం!
సింగరేణిలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నూతన సారథుల ఎంపిక
గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలే లక్ష్యం