- District News
- పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులే మేలు.
పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులే మేలు.
మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
లోకల్ గైడ్/తాండూర్:
పర్యావరణానికి హాని కలిగించని మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు పిలుపునిచ్చారు. ఆదివారం తాండూరు గంజ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, "మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం" అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు. శాస్త్రాలు, పురాణాల ప్రకారం మట్టి గణపతి పూజకు విశిష్ట స్థానం ఉందని, మట్టి విగ్రహాల పూజ ఆధ్యాత్మికంగా శుభప్రదమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని తెలిపారు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారైన విగ్రహాలకు బదులుగా మట్టి లేదా పసుపుతో చేసిన వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా ప్రకృతిని కాపాడటంతో పాటు వినాయకుని అనుగ్రహం పొందవచ్చని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఈ వినాయక చవితి సందర్భంగా అందరూ మట్టి గణపతినే ప్రతిష్ఠించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, ఓం ప్రకాష్ సోమాని, మన్మోహన్ సారాడ, పటేల్ విజయ్ కుమార్, మర్యాద రామకృష్ణ, కటకం వీరేందర్, నాగారం జగదీష్, లింగదలి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
