ఓటు హక్కు పరిరక్షణ బిఎల్ఎల బాధ్యత తాండూరు ఎమ్మెల్యే శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి.

తాండూరు క్యాంప్ కార్యాలయంలో తాండూరు పట్టణ BLAలతో సమీక్ష సమావేశం.

ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బీఎంఆర్.
Published On
ఓటు హక్కు పరిరక్షణ బిఎల్ఎల బాధ్యత తాండూరు ఎమ్మెల్యే శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి.

లోకల్ గైడ్/తాండూర్:
 ఓటు హక్కు పరిరక్షణ పూర్తి బాధ్యత బిఎల్ఏ ల పైన ఉంటుందని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం సర్ పురోగతిపై తాండూర్ పట్టణ బిఎల్ఏలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ...
BLA లు కీలకపాత్ర పోషిస్తున్నారు, మిగతా 10రోజులు కూడా మీ పాత్ర కీలకంగా ఉండాలి.ఓటు హక్కు భారత రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన ప్రజాస్వామ్య హక్కు. అర్హత ఉన్న ఓటరు పేరు కూడా ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా ప్రతి BLA అప్రమత్తంగా పనిచేయాలి.ఇంటింటికీ వెళ్లి ప్రజలకు SIR ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ, అవసరమైన దరఖాస్తులను సకాలంలో పూర్తి చేయించాలన్నారు.ప్రతి బూత్, ప్రతి వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రజల ఓటు హక్కును కాపాడాలని పిలుపునిచ్చారు.ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఖచ్చితమైన ఓటరు జాబితా ఎంతో కీలకమని, ఈ బాధ్యతను ప్రతి కార్యకర్త నిబద్ధతతో నిర్వర్తించాలని ఎమ్మెల్యే గారు అన్నారు.ఈ కార్యక్రమంలో TPCC SIR పర్యవేక్షకులు కోటం వినయ్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ SIR కన్వీనర్ పురుషోత్తం రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నాగరాజు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, BLAలు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఓటు హక్కు పరిరక్షణ బిఎల్ఎల బాధ్యత తాండూరు ఎమ్మెల్యే శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి. ఓటు హక్కు పరిరక్షణ బిఎల్ఎల బాధ్యత తాండూరు ఎమ్మెల్యే శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి.
ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బీఎంఆర్.
కారేపల్లిలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
ప్రజల్లోనే నిమగ్నమైన మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ 
పోలీసుల నిర్బంధాన్ని  ఛేదించి పోరాడిన  విద్యార్థులు – ఫాసిస్టు దమనకాండతో దేశ యువతను అణచలేరు!
సదాశివపేటలో భక్తి పారవశ్యంగా జగన్నాథ రథయాత్ర ప్రత్యేక పూజలు చేసిన చింత సాయినాథ్ 
ఓటు హక్కు మాత్రమే కాదు...బాధ్యత కూడా. - పాఠశాల డైరెక్టర్ ధ్యావరి జయవర్ధన్ రెడ్డి
ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం:  నోరు అదుపులో పెట్టుకోవాలి.