కారేపల్లిలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

ముఖ్య  అతిథిగా వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు బానోత్ మనీషా లక్ష్మి మదన్ లాల్

Published On
కారేపల్లిలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

 

 

ఖమ్మం జిల్లా, కారేపల్లి(సింగరేణి ) : లోకల్ గైడ్, జూలై 24 : సింగరేణి మండలం కారేపల్లి టౌన్‌లో భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)  జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు  బానోత్ మనీషా లక్ష్మి మదన్ లాల్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బానోత్ మనీషా లక్ష్మి మదన్ లాల్ మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధిలో కేటీఆర్ సేవలు విశేషమని, యువతకు స్ఫూర్తిదాయక నాయకుడిగా నిలిచారని కొనియాడారు. ఆయనకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వంకుడోత్ జగన్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డొంకనా రవీందర్, తాత ఎంకన్న , మాజీ సర్పంచ్‌లు బన్సీలాల్,మోహన్,సమ్మయ్య,గంగారబోయిన సత్యం,స్వామి, యుగంధర్, శ్రీకాంత్,తెలంగాణ ఉద్యమకారుడు సోమందుల నాగరాజు , యువజన నాయకులు ఆదేర్ల నాగి, గంగారబోయిన మురళి,సంపత్,వికాస్, సన్నీ తదితరులు పాల్గొని కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు.

Tags:

About The Author

Latest News

కారేపల్లిలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు కారేపల్లిలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
        ఖమ్మం జిల్లా, కారేపల్లి(సింగరేణి ) : లోకల్ గైడ్, జూలై 24 : సింగరేణి మండలం కారేపల్లి టౌన్‌లో భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు
ప్రజల్లోనే నిమగ్నమైన మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ 
పోలీసుల నిర్బంధాన్ని  ఛేదించి పోరాడిన  విద్యార్థులు – ఫాసిస్టు దమనకాండతో దేశ యువతను అణచలేరు!
సదాశివపేటలో భక్తి పారవశ్యంగా జగన్నాథ రథయాత్ర ప్రత్యేక పూజలు చేసిన చింత సాయినాథ్ 
ఓటు హక్కు మాత్రమే కాదు...బాధ్యత కూడా. - పాఠశాల డైరెక్టర్ ధ్యావరి జయవర్ధన్ రెడ్డి
ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం:  నోరు అదుపులో పెట్టుకోవాలి.
ప్రజా సమస్యలను గాలికొదిలిన ఎమ్మెల్యే : సీపీఐ నాయకుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి