నూతన ఎక్సైజ్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక

-అధ్యక్షుడిగా శ్రీకాంత్.. జనరల్ సెక్రటరీగా సౌకత్ అలీ

Published On
నూతన ఎక్సైజ్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక

 

పెద్దపల్లి , ఆగస్టు 21: (లోకల్ గైడ్ )

పెద్దపల్లి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని ఎక్సైజ్ శాఖ సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఎన్నికల అధికారిగా వ్యవహరించిన డీటీఎఫ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ శిరీష ఫలితాలను ప్రకటించారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్, జనరల్ సెక్రటరీగా సౌకత్ అలీ, కోశాధికారిగా విష్ణువర్ధన్ ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్‌గా ప్రశాంత్, మహిళా సమైక్య కార్యదర్శిగా తిరుమల, పబ్లిసిటీ సెక్రటరీగా సురేష్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా శిరీష, సంతోష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఈ ఎన్నికల కార్యక్రమంలో ఎస్‌ఐలు శ్రీనివాస్, స్రవంతితో పాటు ఎక్సైజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లాలో ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. సిబ్బంది సంక్షేమమే లక్ష్యంగా, అందరినీ సమన్వయం చేసుకుంటూ ఐక్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు.

Tags:

About The Author

Latest News

హార్వెస్ట్ లో ఉపాధ్యాయుల దినోత్సవం హార్వెస్ట్ లో ఉపాధ్యాయుల దినోత్సవం
  ఖమ్మం  సెప్టెంబర్ 5: లోకల్ గైడ్: సర్వేపల్లిరాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని నగరంలోని హార్వెస్ట్పాఠశాల ఉపాధ్యాయులు దినోత్సవ వేడుకలు కృష్ణ వేడుకలు శుక్రవారం నిర్వహించారు హార్వెస్ట్ స్కూలు
కృష్ణనామస్మరణతో మార్మోగిన గేట్ కారేపల్లి!
మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులవ్వాలి.... పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)
వైరాలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
విరాట్ మోటార్స్ నూతన ఓలా షోరూం ఘనంగా ప్రారంభం...
తెలంగాణలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి.