వైరాలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

గ్లోబల్ కిడ్స్‌ ప్లే స్కూల్‌లో చిన్నారుల సందడి

Published On
వైరాలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు



ఖమ్మం జిల్లా ప్రతినిధి వైరా సెప్టెంబర్ 04: లోకల్ గైడ్:

ఖమ్మం జిల్లా వైరా పట్టణంలోని గ్లోబల్ కిడ్స్‌ ప్లే స్కూల్‌లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులను శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అలంకరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిపారు.IMG-20260904-WA0228
పాఠశాల నిర్వాహకులు చిన్నారులతో ఉట్టి కొట్టే వేడుకను అట్టహాసంగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను నిర్వహిస్తున్నామని, శ్రీకృష్ణుడి ఆశీస్సులు విద్యార్థులపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
కృష్ణుడి వేషధారణలో చిన్నారులు ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనగా, గోపికల వేషధారణలో ఉన్న బాలికలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారుల ఆటపాటలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Tags:

About The Author

Latest News

మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులవ్వాలి.... పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులవ్వాలి.... పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)
మహిళా సంఘాలకు అండగా ప్రభుత్వం.. వడ్డీలేని రుణాలు, ఉపాధి అవకాశాలు. సత్తుపల్లిలో ఇందిర మహిళాశక్తి సదస్సు లో పాల్గొని మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన మంత్రి...
వైరాలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
విరాట్ మోటార్స్ నూతన ఓలా షోరూం ఘనంగా ప్రారంభం...
తెలంగాణలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి.  
విద్యార్థుల చదువులకు నరసింహారావు–ప్రసన్న లక్ష్మి దంపతుల చేయూత
మిషన్ భగీరథ నీటి సరఫరా లో పంప్ హౌస్ లో సాంకేతిక అంతరాయం