విద్యార్థి కుటుంబానికి రెడ్‌క్రాస్ సొసైటీ లక్ష ఆర్థిక సహాయం

Published On
విద్యార్థి కుటుంబానికి రెడ్‌క్రాస్ సొసైటీ లక్ష ఆర్థిక సహాయం


నారాయణపేట ఆగస్టు 22:
నారాయణపేట మండలం ఎక్లాస్‌పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదు వుతున్న విద్యార్థి పాము కాటుకు గురై మృతి చెంది న విషయం తెలిసిందే. 
ఈ నేపథ్యంలో నిరుపేద కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ అధ్య క్షురాలు సి.హెచ్. ప్రియాంక, ఆదేశాల మేరకు శనివారం జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వ ర్యంలో బాధిత కుటుంబాని కి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.
విద్యార్థి కుటుంబంలోని జీవించి ఉన్న ఇద్దరు సోద రులైన 5వ తరగతి, 2వ తరగతి చదువుతున్న చిన్నారుల పేరిట ఎస్‌బీ ఐలో ఒక్కొక్కరికి .50 వేల చొప్పున రెండు ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్లను ఏర్పా టు చేశారు. ఈ బాండ్లను విద్యార్థుల తల్లిదండ్రులు పిచ్చిగుంట్ల గురునాథ్ దంపతులకు జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక మాట్లాడుతూ, బాధిత కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులను అభి నందించారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు మాన వతా దృక్పథంతో సహాయ సహకారాలు అందించ డంలో రెడ్‌క్రాస్ సొసైటీ ముందుండాలని సూచించా రు.అనంతరం జిల్లా రెడ్‌క్రా స్ సొసైటీ సభ్యత్వ నమో దు, జిల్లా బాడీ ఎన్నికల నిర్వహణ తదితర అంశా లపై సమావేశంలో సమీక్షిం చారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మ న్ కొట్టం సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్మన్ సరఫ్ నాగరా జ్, కోశాధికారి డాక్టర్ మదన్‌మోహన్ రెడ్డి, స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యులు ఆత్మారం ఎడ్కే, ప్యాట్రన్ శ్రీ హరినారాయణ భట్టాడ్, వై ఆర్ సి,జే ఆర్ సి కోఆర్డి నేటర్లు జొన్నల సుభాష్, నందుపాటిల్, సభ్యులు శ్రీనివాస్ లాహోటి, యూసు ఫ్ తాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:8.ఆర్థిక సహాయం అందజేసిన కలెక్టర్

Tags:

About The Author

Latest News

హార్వెస్ట్ లో ఉపాధ్యాయుల దినోత్సవం హార్వెస్ట్ లో ఉపాధ్యాయుల దినోత్సవం
  ఖమ్మం  సెప్టెంబర్ 5: లోకల్ గైడ్: సర్వేపల్లిరాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని నగరంలోని హార్వెస్ట్పాఠశాల ఉపాధ్యాయులు దినోత్సవ వేడుకలు కృష్ణ వేడుకలు శుక్రవారం నిర్వహించారు హార్వెస్ట్ స్కూలు
కృష్ణనామస్మరణతో మార్మోగిన గేట్ కారేపల్లి!
మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులవ్వాలి.... పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)
వైరాలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
విరాట్ మోటార్స్ నూతన ఓలా షోరూం ఘనంగా ప్రారంభం...
తెలంగాణలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి.