_పవర్ ఎగ్జిబిషన్–2026కు విశేష ప్రజాదరణ

_మూడు రోజుల్లో 12 వేల మందికి పైగా సందర్శకులు.. విద్యార్థులు, యువత నుంచి భారీ స్పందన

_శాశ్వత పవర్ ఎగ్జిబిషన్ కేంద్రం ఏర్పాటుకు పరిశీలన: సీఎండీ జితేష్ వి. పాటిల్
Published On
_పవర్ ఎగ్జిబిషన్–2026కు విశేష ప్రజాదరణ

 

 

 

హైదరాబాద్ ఆగస్టు 24 (లోకల్ గైడ్ ప్రతినిధి)


హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వేదికగా టీజీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఆగస్టు 22 నుంచి 2IMG-20260824-WA02844 వరకు నిర్వహించిన పవర్ ఎగ్జిబిషన్–2026కు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనకు 12 వేల మందికి పైగా సందర్శకులు హాజరై విజయవంతం చేశారు. విద్యార్థులు, యువత, విద్యుత్ వినియోగదారులు, సాంకేతిక నిపుణులు, వివిధ విద్యాసంస్థల ప్రతినిధులు, కుటుంబాలతో వచ్చిన సందర్శకులు పెద్ద సంఖ్యలో ప్రదర్శనను సందర్శించారు.

టీఎస్ ఈఆర్ సి ఛైర్మన్, సభ్యుల సందర్శన

 

ఎగ్జిబిషన్ చివరి రోజు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ ఈ ఆర్సి) ఛైర్మన్ డా. జస్టిస్ దేవరాజు నాగార్జున, సభ్యులు  రఘు కంచర్ల (టెక్నికల్),  చెరుకూరి శ్రీనివాసరావు (ఫైనాన్స్) ప్రదర్శనను సందర్శించారు. వివిధ స్టాళ్లను క్షుణ్ణంగా పరిశీలించి విద్యుత్ రంగ చరిత్ర, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా ప్రమాణాలకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. టీజీఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు శ్రీ వి. శివాజీ, శ్రీ కృష్ణారెడ్డి, డాక్టర్ ఎన్. నరసింహులుతో పాటు మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్ జోన్ల అధికారులు, సిబ్బంది వారికి స్వాగతం పలికారు.

స్టాళ్లను పరిశీలించిన కల్వకుంట్ల కవిత

అదే రోజు కల్వకుంట్ల కవిత కూడా పవర్ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. సుమారు 30 నిమిషాల పాటు ప్రతి స్టాల్‌ను పరిశీలిస్తూ విద్యుత్ రంగ చరిత్ర, ఆధునిక సాంకేతికతలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో మమేకమై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల్లో విద్యుత్ రంగంపై అవగాహన కల్పించే విధంగా ప్రదర్శనను రూపొందించినందుకు తెలంగాణ ప్రభుత్వం, టీజీఎస్పీడీసీఎల్యాజమాన్యాన్ని ఆమె అభినందించారు.

120 ఏళ్ల విద్యుత్ ప్రస్థానం ఆవిష్కరణ

పవర్ ఎగ్జిబిషన్‌లో తెలంగాణ విద్యుత్ రంగం 120 ఏళ్ల ప్రస్థానం, విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థల అభివృద్ధి, స్మార్ట్ గ్రిడ్‌లు, డిజిటల్ సేవలు, భద్రతా ప్రమాణాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, భవిష్యత్ విద్యుత్ అవసరాలకు అనుగుణంగా చేపడుతున్న చర్యలను ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో ప్రదర్శించారు.
పాతకాలపు విద్యుత్ మీటర్ల నుంచి ఆధునిక స్మార్ట్ మీటర్ల వరకు వివిధ పరికరాలను ప్రదర్శనలో ఉంచడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాత విద్యుత్ మీటర్లను చూసిన పెద్దలు తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. విద్యుత్ వ్యవస్థలో కాలానుగుణంగా చోటుచేసుకున్న సాంకేతిక మార్పులను ఆసక్తిగా తెలుసుకున్నారు.

విద్యార్థులకు ప్రత్యక్ష సాంకేతిక అనుభవం

ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. విద్యుత్ రంగంలో వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరికరాలు, సబ్‌స్టేషన్లు, స్మార్ట్ వ్యవస్థలు, భద్రతా పరికరాలను ప్రత్యక్షంగా చూసి విద్యార్థులు ఆసక్తి వ్యక్తం చేశారు. పాఠ్యపుస్తకాల్లో చదివే అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా విద్యుత్ రంగంపై తమ అవగాహన మరింత పెరిగిందని పలువురు విద్యార్థులు తెలిపారు.వి ఎన్ ఆర్, వి జీ ఐ ఈ టి,
సి ఎం ఆర్ , ఇంజినీరింగ్ కాలేజ్, బి బి ఆర్ ఐ టి, , విద్యాజ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,  సి బి ఐ టి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, మహావీర్ ఇంజినీరింగ్ కాలేజ్, మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజ్ తదితర విద్యాసంస్థల విద్యార్థులు ప్రదర్శనను సందర్శించారు. పాఠశాల విద్యార్థులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

లేజర్ షోకు విశేష ఆదరణ


ఎగ్జిబిషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన లేజర్ షోకు సందర్శకుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రతి రోజు సాయంత్రం 7.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు నిర్వహించిన లేజర్ షోను చిన్నారులు, యువత, కుటుంబాలతో వచ్చిన సందర్శకులు ఆసక్తిగా వీక్షించారు.విద్యుత్ రంగ చరిత్ర, సాంకేతిక అభివృద్ధి, తెలంగాణ విద్యుత్ రంగ ప్రగతిని సృజనాత్మకంగా ప్రతిబింబించిన లేజర్ షో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ప్రత్యేక కార్యక్రమాన్నిమరికొన్నిరోజులుకొనసాగించాలని పలువురు సందర్శకులు కోరారు.

శాశ్వత ప్రదర్శన కేంద్రం దిశగా అడుగులు

పవర్ ఎగ్జిబిషన్‌కు లభించిన అపూర్వ స్పందన నేపథ్యంలో భవిష్యత్‌లో విద్యార్థులు, విద్యుత్ వినియోగదారులు, ప్రజల కోసం విద్యుత్ రంగ చరిత్ర, ఆధునిక సాంకేతికతలను ప్రతిబింబించే శాశ్వత ప్రదర్శన కేంద్రం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ శ్రీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ తెలిపారు.ప్రజలు, విద్యార్థులు ఏడాది పొడవునా విద్యుత్ వ్యవస్థ, సాంకేతిక పరిణామాలు, భద్రతా ప్రమాణాల గురించి తెలుసుకునేలా ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.ప్రజల్లో విద్యుత్ భద్రత, విద్యుత్ వినియోగంపై అవగాహన పెంపొందించడం, విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం, తెలంగాణ విద్యుత్ రంగ ప్రగతిని ప్రజలకు చేరువ చేయడం లక్ష్యంగా నిర్వహించిన పవర్ ఎగ్జిబిషన్–2026 విజయవంతంగా ముగిసింది. మూడు రోజుల్లో 12 వేల మందికి పైగా సందర్శకులు హాజరు కావడం ఈ ప్రదర్శనకు లభించిన ఆదరణకు నిదర్శనంగా నిలిచింది.

Tags:

About The Author

Latest News

హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు
  ఆగస్టు 29(లోకల్ గైడ్) హైదరాబాద్‌లోని బండ్లగూడ జగీర్‌కు చెందిన 49 ఏళ్ల సర్జన్‌ను ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు దారుణంగా మోసగించారు. జులై 2025లో
Toxic Box Office Collection Day 3: తగ్గుతున్న కలెక్షన్లు.. వరల్డ్‌వైడ్‌గా యష్ ‘టాక్సిక్’ సాధించిందెంత?
Google Pixel Watch 5: AI ఆధారిత GPS టెక్నాలజీతో పిన్‌పాయింట్ లొకేషన్ ట్రాకింగ్! గూగుల్ మ్యాప్స్ 3D మోడల్స్, AI సహాయంతో బ్యాటరీ లైఫ్ తగ్గకుండా లొకేషన్ ఆక్యురేసీ
పాకిస్థాన్ బ్యాటింగ్ ఘోర వైఫల్యం: మైఖేల్ వాన్ ఘాటు విమర్శలు! | Pak vs Eng Test కౌంటీ క్రికెట్ స్థాయి కూడా లేదంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆగ్రహం
నేపాల్‌ వరదలు: విదేశీ సహాయక బృందాలకు ఎట్టకేలకు అనుమతి
రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి:
ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు.