ఐటీడీఏ ప్రాంగణంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి ఐటీడీఏ అహర్నిశలు కృషి : పీవో బీ రాహుల్

Published On
ఐటీడీఏ ప్రాంగణంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

 

 

భద్రాచలం : లోకల్ గైడ్ న్యూస్ :
భద్రాచలం ఐటీడీఏ కార్యాలయ ప్రాంగణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీవో బి. రాహుల్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ తదితర మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ వంటి త్యాగధనుల స్ఫూర్తితో గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. గిరిజన విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రత్యేక విద్యా క్యాలెండర్లు, కెరీర్ గైడెన్స్, టీఎల్ఎం ప్రదర్శనలు, ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలుIMG-20260815-WA0336 చేపట్టినట్లు తెలిపారు. గిరిజన విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంతో పాటు ఐఐటీ, ఎన్ఐటీ ప్రవేశాల్లో ప్రతిభ కనబరచడం గర్వకారణమన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగుపరచి, మారుమూల ప్రాంతాల్లో వైద్య శిబిరాలు, మొబైల్ మెడికల్ టీమ్స్, బైక్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. గిరిజన మహిళల స్వయం ఉపాధి కోసం భద్రగిరి మార్ట్ ద్వారా వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఐటీడీఏ పరిధిలో నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయం, మత్స్య, ఉద్యాన, ఇంజనీరింగ్, విద్యుత్, గిరిజన సంక్షేమ రంగాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియాన్ని ఇప్పటివరకు సుమారు 2.50 లక్షల మంది సందర్శించారని, మ్యూజియానికి రాష్ట్ర స్థాయి ఉత్తమ పురస్కారం లభించిందని తెలిపారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, కోయ భాష పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, కొండరెడ్ల కుటుంబాల సమగ్ర సర్వే నిర్వహించినట్లు చెప్పారు. అటవీ హక్కుల పరిరక్షణతో పాటు పర్యావరణ సంరక్షణ, పోడు భూముల్లో పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు.
దేశవ్యాప్తంగా గిరిజన సంక్షేమ పథకాల అమలులో ఉత్తమ ఐటీడీఏగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం భద్రాచలం ఐటీడీఏకు గర్వకారణమని పీవో రాహుల్ పేర్కొన్నారు. గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి ఐటీడీఏ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

Tags:

About The Author

Latest News

హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు
  ఆగస్టు 29(లోకల్ గైడ్) హైదరాబాద్‌లోని బండ్లగూడ జగీర్‌కు చెందిన 49 ఏళ్ల సర్జన్‌ను ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు దారుణంగా మోసగించారు. జులై 2025లో
Toxic Box Office Collection Day 3: తగ్గుతున్న కలెక్షన్లు.. వరల్డ్‌వైడ్‌గా యష్ ‘టాక్సిక్’ సాధించిందెంత?
Google Pixel Watch 5: AI ఆధారిత GPS టెక్నాలజీతో పిన్‌పాయింట్ లొకేషన్ ట్రాకింగ్! గూగుల్ మ్యాప్స్ 3D మోడల్స్, AI సహాయంతో బ్యాటరీ లైఫ్ తగ్గకుండా లొకేషన్ ఆక్యురేసీ
పాకిస్థాన్ బ్యాటింగ్ ఘోర వైఫల్యం: మైఖేల్ వాన్ ఘాటు విమర్శలు! | Pak vs Eng Test కౌంటీ క్రికెట్ స్థాయి కూడా లేదంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆగ్రహం
నేపాల్‌ వరదలు: విదేశీ సహాయక బృందాలకు ఎట్టకేలకు అనుమతి
రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి:
ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు.