రూ.3.85 లక్షలకు వినాయక లడ్డూ సొంతం చేసుకున్న "రాయికల్ శ్రీనివాస్"

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమక్షంలో భక్తిశ్రద్ధలతో లడ్డూ వేలంపాట

వేలంలో లడ్డూ దక్కించుకున్న కాంగ్రెస్ నాయకుడికి ఎమ్మెల్యే అభినందనలు
Published On
రూ.3.85 లక్షలకు వినాయక లడ్డూ సొంతం చేసుకున్న

IMG-20260926-WA0019షాద్‌నగర్

షాద్‌నగర్    భగత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వినాయక లడ్డూ వేలంపాటలో ఫరూక్‌నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్ రూ.3 లక్షల 85 వేలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. షాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెంటారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి తదితరుల సమక్షంలో ఉత్సాహంగా సాగిన వేలంపాటలో రాయికల్ శ్రీనివాస్ ఆసక్తిగా పాల్గొని అత్యధిక మొత్తానికి లడ్డూను దక్కించుకున్నారు.
స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ ముఖ్యఅతిథిగా హాజరై లడ్డూ వేలంపాట కార్యక్రమంలో పాల్గొన్నారు. లడ్డూను సొంతం చేసుకున్న రాయికల్ శ్రీనివాస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమక్షంలో లడ్డూను తలపై పెట్టుకుని గణనాథుడిపై తన భక్తిని చాటుకున్నారు. ఈ దృశ్యం అక్కడున్న భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ నవరాత్రుల పాటు పూజలు అందుకున్న వినాయకుడి లడ్డూను భక్తిశ్రద్ధలతో వేలంపాటలో సొంతం చేసుకోవడం శుభపరిణామమన్నారు. లడ్డూను దక్కించుకున్న రాయికల్ శ్రీనివాస్‌కు అభినందనలు తెలిపారు. గణనాథుడి ఆశీస్సులతో ఆయన కుటుంబంతో పాటు ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.
భగత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన నిర్వాహకులను ఎమ్మెల్యే శంకర్ అభినందించారు. మున్సిపల్ వైస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు అందే మోహన్ ముదిరాజ్‌తో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు.
వినాయక ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావాన్ని, ఐక్యతను పెంపొందించేలా మరింత ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే శంకర్ ఆకాంక్షించారు. గణనాథుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు..

Tags:

About The Author

Latest News

ఆశాలకు రూ.18 వేలు ఇవ్వకపోతే నిరవధిక సమ్మె : గోనే యువరాజు ఆశాలకు రూ.18 వేలు ఇవ్వకపోతే నిరవధిక సమ్మె : గోనే యువరాజు
    నర్సంపేట, అక్టోబర్ 07 (లోకల్ గైడ్):  ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం వెంటనే ఇవ్వాలని
హైదరాబాద్–రంగారెడ్డి మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ వేగవంతం: 
నల్లబెల్లి మండలంలో యూత్ కాంగ్రెస్ దూకుడు : మూడు గ్రామాల్లో ఏకగ్రీవంగా నూతన కమిటీలు
తూము వివాదం - చెరువు కట్టపై ఉద్రిక్తత
వికారాబాద్ ఆర్టీసీ బస్టాండ్ లో హెచ్ఐవి అవగాహన కార్యక్రమం,
కారేపల్లి కస్తూర్బా విద్యాలయంలో కలెక్టర్ దివాకర్.టి.ఎస్ ఆకస్మిక పరిశీలన
కారేపల్లి మండల కార్యాలయంలో పోషకాహార ప్రదర్శనలో కలెక్టర్ దివాకర టి.ఎస్