టి యు డబ్ల్యూ జే హెచ్ 143 సభలో పాల్గొన్న ప్రముఖ వ్యాపారవేత్త సయ్యద్ ఇక్బాల్

Published On
టి యు డబ్ల్యూ జే హెచ్ 143 సభలో పాల్గొన్న ప్రముఖ వ్యాపారవేత్త సయ్యద్ ఇక్బాల్

లోకల్ గైడ్,వికారాబాద్:
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్  అల్లం నారాయణ నేతృత్వంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక సమావేశంలో వికారాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక వేత్త మహమ్మద్ ఇక్బాల్ ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్నారు.
జర్నలిస్టుల సంక్షేమం, సమాజంలో మీడియా పాత్ర మరియు ప్రస్తుత సామాజిక-ఆర్థిక అంశాలపై చర్చించేందుకు ఈ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకుడు అల్లం నారాయణతో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ప్రసంగించారు.
ఈ సందర్భంగా  సయ్యద్ ఇక్బాల్, ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన జర్నలిజం సమాజ పురోగతికి ఎంతో కీలకమని కొనియాడారు. రాత్రింబవళ్ళు కష్టపడి సమాజంలో నిజాలను వెలికితీస్తూ, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న విలేకరుల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి, వారి హక్కుల సాధనకు అల్లం నారాయణ వహిస్తున్న నాయకత్వాన్ని ఆయన అభినందించారు.
పత్రికా రంగానికి, జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని  ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి వికారాబాద్ వికారాబాద్ వైస్ ప్రెసిడెంట్ అర్థ సుధాకర్ రెడ్డి బీజేపీ మాజీ మండల అధ్యక్షులు బీసీ సెల్ నెంబర్ సుప్రభాత్ పటేల్ టిఆర్ఎస్ పార్టీ చంద్రప్రియ  సీనియర్ పాత్రికేయ మిత్రులు రవి, గోపాల్  పలువురు పాత్రికేయులు, మిత్రులు  పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఓటు హక్కుపై కోతను సహించం: సీపీఎం  ఓటు హక్కుపై కోతను సహించం: సీపీఎం 
        కారేపల్లి, అక్టోబర్ 8 (లోకల్ గైడ్ న్యూస్): ఓటర్ల జాబితా సమగ్ర పునఃపరిశీలన పేరుతో అర్హులైన ఓట్ల తొలగింపును నిలిపివేయాలని సీపీఎం ఖమ్మం జిల్లా కమిటీ
డీసీసీ అధ్యక్షుడితో సామ రామ్మోహన్ రెడ్డి భేటీ.
ప్రశ్నిస్తే లాఠీలేనా? బీజేపీని నిలదీసిన గుడిపూడి తిరుమల రావు
మూడు నెలలుగా నిలిచిన 'భగీరథ'.. 
జోరుగా ఇసుక అక్రమ రవాణా!
బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేయాలి, 
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్