- District News
- Ranga Reddy
- శంషాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో మంత్రి ఎమ్మెల్యే కేటీ రామారావు పాయింట్స్
శంషాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో మంత్రి ఎమ్మెల్యే కేటీ రామారావు పాయింట్స్
మహేశ్వరం, ( లోకల్ గైడ్ ): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
సరిగ్గా కరెంట్ రాదు...నీళ్లు పూర్తిస్థాయిలో వచ్చేది లేదు. బిల్డర్లు ఇన్వెస్టర్ల నుంచి 30% కమిషన్ తీసుకొని వాళ్ళని పిడించడం తప్పా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి, ప్రజలకు చేసింది ఏమి లేదని బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కే టి ఆర్ విమర్శించారు. శంషాబాద్ లోని బి ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అయన విలేఖరులతో మాట్లాడారు. మనం అధికారంలోకి వచ్చి ఉంటే రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు ఎప్పుడో మెట్రో వచ్చి ఉండేదన్నారు.
బుద్వేల్ ,నార్సింగ్ ,పుప్పాలగూడ ,నానకరామ్ గూడా
ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తగ్గేదన్నారు.
నార్సింగ్, పుప్పాలగూడ, శంషాబాద్ లో మూడు మెట్రో స్టేషన్లు పెట్టాం. ఇక్కడ ప్రాంత ప్రజలతో పాటు ప్రతి ఒక్కరికి మెట్రో యాక్సిస్ చేసి ట్రాఫిక్ కష్టం తగ్గించే అవకాశం ఉండేదాని తెలిపారు.
ఇక్కడి నుంచి చుట్టుపక్కల వాళ్ళు హైటెక్ సిటీ వెళ్లి పని చేసుకోవడానికి సులభంగా అవుతుండేదని ట్రాఫిక్ కష్టాలు తగ్గుతుండేదాని స్పష్టం చేశారు.
టెండర్ పూర్తిచేసి పనులు చేసే నెల రోజులకే ప్రభుత్వం పోవడంతో ఆలస్యమైందన్నారు.
ఈ ముఖ్యమంత్రికి భూములు అమ్మడం తప్ప అభివృద్ధి చేసే ఆలోచన లేదని విమర్శించారు.
32 ఎస్టీపీలు కట్టిన అవి నిర్మాణం చేయలేని చేతగాని ప్రభుత్వమని మండిపడ్డారు.
గండిపేట నుండి నాగోల్ వరకు ఎస్ టి పి లు వాడకంలోకి వస్తే చుక్క నీరు కూడా ముసిలకు వెళ్ళేది లేకుంట ప్రణాళిక చేసామన్నారు. మరీ ఈ ముఖ్యమంత్రి ముసిలోని ఇల్లు కూలుస్తాం అని పేదల ఇల్లు కూల్చే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు.
ఎస్టిపిలు పూర్తిచేసే ఆలోచన 32 ఎస్టీపీలు కట్టిన అవి నిర్మాణం చేయలేకపోయారన్నారు.
అధికారం లేక పోయినా ప్రజల్లో కేసీఆర్ పై అనురాగం మమ్మకారం అట్లనే ఉందన్నారు.
ఈరోజు ప్రతి అడుగుల్లో కేసీఆర్ ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారన్నారు. నల్ల నీళ్లు రాకపోతే కరెంటు లేకపోతే ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు
బిల్డర్లు పారిశ్రామికవేత్తల తోలు వలచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
హైడ్రాకు వివేక్ వెంకట్ స్వామి, పట్నం మహేందర్రెడ్డి, పొంగులేటి, అనుముల తిరుపతిరెడ్డి, వాళ్ల ఫామ్ హౌస్ లు కనిపియ్యవు కానీ గరీబోళ్ల ఇళ్ళు మాత్రం కనిపిస్తున్నాయని విమర్శించారు.
అంబేద్కర్ రాజ్యంగం నడవడం లేదు, అనుముల రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందన్నారు.
మూడు సంవత్సరాలు అయితుంది హైదరాబాదుకి ఒక ఇటుక పెట్టింది లేదు ఈ ముఖ్యమంత్రి.
హైదరాబాద్ లో కనీసం దోమలను నివారించలేని కొట్టే ఈయన మాత్రం ఫ్యూచర్ సిటీ కడుతడంట అని ఏద్దెవా చేశారు. బి ఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యూచర్ సిటీ రద్దు చేసి హైదరాబాద్ ఫార్మసిటీకి మాత్రమే ప్రాధాన్యతనిస్తామన్నారు. నేను ఇన్వెస్టర్లు పెట్టే వారికి కూడా ముఖ్య సలహా ఇస్తున్నా రాబోయేది బీఆర్ఎస్ పార్టీఏ అక్కడ ఉండేది ఫార్మాసిటీ మాత్రమేనని గుర్తు పెట్టుకోవాలన్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కి ఏమి తక్కువ అని పార్టీ మారాడు,
గామ్స్ మియా గూడా, సుల్తాన్పూర్ భూముల కోసమే కదా.
వచ్చేది బీఆర్ఎస్ పార్టీఏ ఎవరేమి చేసినా ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు. రాబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటర్ని ఎన్రోల్ చేసుకోవాలని సూచించారు. డిగ్రీ సర్టిఫికెట్ ఉంటేనే ఓటరు ఎన్రోల్ అవుతుంది పెద్దపెద్ద నాయకులు కూడా డిగ్రీ సర్టిఫికెట్ లేకుండా గ్రాడ్యుయేట్లని చెప్పుకుంటున్నారన్నారు. మీరు కూడా 8 సంవత్సరాల డిగ్రీ చేశారని ముఖ్యమంత్రి లాగా అనుకుంటారా.
ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేట్ ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలన్నారు. జిల్లాలో రాజేంద్రనగర్ లో ఎక్కువ శాతం ఓటర్ నమోదు ప్రక్రియ ఎన్రోల్మెంట్ చేయాలని సూచించారు.
పోలీసులు శాంతి భద్రతలు పర్యవేక్షించాలి తప్పా తెలంగాణలో పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వంలో డీజే లు బంద్ చేసి కొడుతున్నారు.
డీజే బంద్ చేసిన యువకులు మాత్రం వారిపై దాడి చేసిన
దేక్ లేహింగే అని పాటలు పెడుతూ టిఆర్ఎస్ పై అభిమానం చాటు కోవడం దేనికి సాంకేతమో అర్థం చేసుకోవాలన్నారు.
