అంబేద్కర్ విగ్రహం వద్ద క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచాలి 

రెండో ఆదివారం కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు 

ప్రజామిత్ర రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ 
Published On
అంబేద్కర్ విగ్రహం వద్ద క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచాలి 

 

 

 
కరీంనగర్ నవంబర్ 8 లోకల్ గైడ్ ప్రతినిధి :
 కరీంనగర్ పట్టణంలోని కోర్టు వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొరివి వేణుగోపాల్ అన్నారు.

 నవంబర్ 1 ఆదివారం మొదలుపెట్టిన అంబేద్కర్ విగ్రహానికి ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు పూలమాలలు వేయాలని పిలుపునిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా నవంబర్ రెండవ ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు అంబేద్కర్ అభిమానులు కొరివి వేణుగోపాల్  ఆధ్వర్యంలో పూలమాలలు వేశారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కూడలిలో వ్యాపార, వాణిజ్య, ప్రభుత్వ ప్రకటనలు, జాతీయ పార్టీలు,ప్రాంతీయ పార్టీల నాయకుల ప్రకటనల, ప్రచార ఫ్లెక్సీలను  కట్టవద్దని ఆయన కోరారు.

 ఎందుకంటే వాటి మూలంగా అంబేద్కర్ విగ్రహం కనబడుట లేదు. అలాగే ఆయన ప్రాముఖ్యత, పవిత్రత దెబ్బతింటుందన్నారు.
 అలాగే అంబేద్కర్ కూడలల్లో పూల మొక్కలు, పచ్చని గ్రీనరీని పెంచాలని కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ను కోరారు. ఇక ముందు ఎవరు కూడా అక్కడ. ఫ్లెక్సీలు పెట్టకుండా కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

 ఈ కార్యక్రమంలో గజ్జల ఆనందరావు, చిగిరి శ్రీధర్, మండిగ మాణిక్యరావు, ఎడ్ల రాంకుమార్, గాదం రవీందర్, తాళ్ల వెంకటేష్, మాడేపు నరసయ్య, కొంపెల్లి రవీందర్, లింగంపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
        రంగారెడ్డి జిల్లా బ్యూరో, ( లోకల్ గైడ్ ):                          రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు” కార్యక్రమంలో భాగంగా ఆదివారం
షాద్‌నగర్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
నియోజవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు
పేదల ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇల్లు…. రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పుట్టినరోజు సందర్భంగా  కరీంనగర్ పట్టణంలోని కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి చల్ల ప్యాకెట్లు పంపిణీ చేశారు. 
అంబేద్కర్ విగ్రహం వద్ద క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచాలి 
చర్లలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు