నూతన సిఐ కి శుభాకాంక్షలు తెలిపిన సీపీఐ నాయకులు

Published On
నూతన సిఐ కి శుభాకాంక్షలు తెలిపిన సీపీఐ నాయకులు

 

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి చౌటుప్పల్ అక్టోబర్ 28 (లోకల్ గైడ్):

చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సిఐదేవిరెడ్డి సతీష్ రెడ్డి ని సిపిఐ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రజా సమస్యలు శాంతి భద్రతల పరిరక్షణ ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన ఆవశ్యకతపై చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారం పోలీస్ శాఖకు తమ సహకారం ఉంటుందని తెలిపారు. సీఐని శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పల్లె శేఖర్ రెడ్డి, సిపిఐ మున్సిపల్ కార్యదర్శి పగిళ్ల మోహన్ రెడ్డి, ఉడుతరామలింగం, బద్దుల సుధాకర్, టంగుటూరి రాములు, రొండి నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News