చర్లలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేస్తూ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

Published On
చర్లలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

 

 

చర్ల : లోకల్ గైడ్ న్యూస్ : 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను చర్ల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేస్తూ బాణాసంచా కాల్చి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న కృషిని కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండి మరిన్ని సంవత్సరాల పాటు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నూగూరు (చర్ల) వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ప శ్రీనివాసరావు, చర్ల సొసైటీ చైర్మన్ పరుచూరి రవికుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బండారు రామకృష్ణ, జవ్వాది రవికుమార్, చీమకుర్తి వీరభద్రం, మాజీ మండల అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి, ఎర్రంకి ఉదయ ప్రభాకర్ రావు (బాబ్జి), చర్ల మేజర్ పంచాయతీ ఉపసర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు, గాలి గోపి, సొసైటీ డైరెక్టర్ సుందరి పెద్దిరాజు, సుందరి సురేష్, పటేల్ వెంకటేశ్వర్లు, తోటమల్ల వరప్రసాద్, ఆత్మ కమిటీ డైరెక్టర్ అలవాల మహేష్ నాయుడు (బాలు), ఉంజుపల్లి సర్పంచ్ కాక సావిత్రి, కాక ధర్మయ్య, దోమల రవికాంత్, న్యాయవాది సంతోష్, మ్యాజిక్ యూనియన్ అధ్యక్షుడు బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, సొసైటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సెల్ సభ్యులు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, ఐఎన్‌టీయూసీ, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Tags:

About The Author

Latest News

ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
        రంగారెడ్డి జిల్లా బ్యూరో, ( లోకల్ గైడ్ ):                          రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు” కార్యక్రమంలో భాగంగా ఆదివారం
షాద్‌నగర్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
నియోజవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు
పేదల ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇల్లు…. రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పుట్టినరోజు సందర్భంగా  కరీంనగర్ పట్టణంలోని కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి చల్ల ప్యాకెట్లు పంపిణీ చేశారు. 
అంబేద్కర్ విగ్రహం వద్ద క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచాలి 
చర్లలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు