- District News
- పట్టభద్రుల ఓటరు నమోదుకు కృషి చేద్దాం
పట్టభద్రుల ఓటరు నమోదుకు కృషి చేద్దాం
మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్
హనుమకొండ జిల్లా ప్రతినిధి, అక్టోబర్26
(లోకల్ గైడ్ న్యూస్)
వడ్డేపల్లి : పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియలో పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరూ భాగస్వాములై అర్హులైన పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు అయ్యేలా కృషి చేద్దామని మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా 60వ డివిజన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో సోమవారం రోజున పట్టభద్రులను కలిసి ఓటరు నమోదు కోసం అవసరమైన ఫారం-18ను అందజేశారు. అర్హులైన పట్టభద్రులందరూ ఫారం-18 ద్వారా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని కోరారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని, అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామి కావాలని ఆయన సూచించారు.
పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ, అర్హులైన వారందరూ నమోదు చేసుకునేలా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు ఇప్పటికే సూచించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల డివిజన్ ఇంచార్జ్ రఘు, ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ బాధ్యులు జనార్ధన్, డివిజన్ సీనియర్ నాయకులు తోట నవీన్, విజయపాల్ కాలనీ బీఎల్ఏ విష్ణు, టీచర్స్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు
