- District News
- Khammam
- అమ్మవారి అన్నదానానికి బీఆర్‌ఎస్ అండదండ!
అమ్మవారి అన్నదానానికి బీఆర్‌ఎస్ అండదండ!
గోవిందుతండా మహా అన్నదానానికి రూ.5,116 ఆర్థిక సాయం అందించిన మాదారం బీఆర్‌ఎస్ గ్రామ శాఖ
కారేపల్లి, అక్టోబర్ 17 (లోకల్ గైడ్ న్యూస్):
దేవి నవరాత్రుల సందర్భంగా సింగరేణి మండలం మాదారం గ్రామపంచాయతీ పరిధిలోని గోవిందుతండాలో అమ్మ భవాని యూత్ సభ్యులు నిర్వహించనున్న మహా అన్నదాన కార్యక్రమానికి మాదారం బీఆర్‌ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో రూ.5,116 విరాళంగా అందజేశారు. అమ్మవారి సేవలో భాగంగా అన్నదాన కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించి సేవాభావాన్ని చాటుకున్నారు.
దేవి నవరాత్రుల వేడుకల్లో భాగంగా అమ్మవారి విగ్రహం వద్ద నిర్వహించనున్న మహా అన్నదాన కార్యక్రమానికి సహకారం అందించడం పట్ల అమ్మ భవాని యూత్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు గ్రామంలో ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పలువురు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కిలారి వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ మంగ లాలు, మాజీ ఎంపీటీసీ రవి, 8వ వార్డు సభ్యుడు పాయం మునిందర్, వంశీ, శివరాత్రి బాబు, కాంట్రాక్టర్ బి. వీరన్న, బి. మల్లికార్జున్, పి. వీరన్న, జె. రవి, బి. సూక్యా, బి. లాలు, బి. కోటి, అమ్మ భవాని యూత్ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
