- District News
- చలో హైదరాబాదుకు తరలిన మున్సిపల్ కార్మికులు
చలో హైదరాబాదుకు తరలిన మున్సిపల్ కార్మికులు
పెద్దపల్లి జిల్లా అక్టోబర్ 26 (లోకల్ గైడ్ )
సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాదు ఇందిరా పార్క్ వద్ద జరిగే మహా ధర్నాకు సుల్తానాబాద్ మున్సిపల్ తరళి వెళుతున్న వాహనాలను సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి తాండ్ర అంజయ్య జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు మున్సిపల్ కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, కనీస వేతనం 42 వేల రూపాయలు ఇవ్వాలని, పని భద్రత, సామాజిక భద్రత కల్పించాలని, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని తదితర డిమాండ్లతో ఈ మహా ధర్నా జరుగుతుందని పెద్ద ఎత్తున కార్యక్రమంలో మున్సిపల్ సంఘం జిల్లా అధ్యక్షులు పాక మహేష్ మున్సిపల్ సంఘం అధ్యక్షులు న్యాతరి రమేష్, ప్రధాన కార్యదర్శి ఆరేపల్లి సురేష్, లక్ష్మి, కలవల శీను, కొమ్మ గళ్ళ బాబు, సది, రాములు, రామ్మూర్తి, లక్ష్మణ్, అనిల్, కుమార్, సత్యం, మహంకాళి మల్లేష్, గంగవ్వ, సునీత, ఓదెలు, తదితరులు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.
