ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

Published On
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

 

కరకగూడెం, లోకల్ గైడ్ న్యూస్  : 
రానున్న ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ పిలుపునిచ్చారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆదేశాల మేరకు సోమవారం కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల స్థాయి ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీ శ్రేణులు ఎన్నికల కోసం సమష్టిగా కృషి చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని, నవంబర్ 6లోగా ఓటరు నమోదుకు అర్హులైన వారితో దరఖాస్తులు చేయించాలని కోరారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయించేలా పట్టభద్రులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల కారణంగా భవిష్యత్తులో తలెత్తే నీటి ఎద్దడి, కరువు సమస్యలపై ప్రజలకు ముందస్తు అవగాహన కల్పించాలని సూచించారు. నీటి పొదుపు, అందుబాటులో ఉన్న నీటి వనరుల సమర్థ వినియోగంపై ప్రజలకు వివరించాలని తెలిపారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజాప్రతినిధులు గుర్తించి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా తాగునీరు, మౌలిక సదుపాయాల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఎర్ర సురేష్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు చౌలం కేశవరావు, ఉపాధ్యక్షుడు కల్తి విజయ్, పద్మాపురం సర్పంచ్ తోలెం రమేష్, ఉపసర్పంచ్ పూజారి వెంకన్న, ఎస్సీ సెల్ అధ్యక్షుడు జాడి శ్రీను, మాజీ ఉపసర్పంచులు కొమరం వెంకటేశ్వర్లు, బాడిష లక్ష్మీనారాయణ, మండల నాయకులు గొగ్గలి రవి, తోలెం కృష్ణ, సీనియర్ నాయకులు అత్తే సారయ్య, నక్క చంటి, బెజవాడ రాములు, వెంకట్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు, మహిళలు, యువకులు హాజరయ్యారు.

Tags:

About The Author

Latest News

పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహణ . పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహణ .
          నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . లోకల్ గైడ్ . పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా దేశం కోసం, ప్రజల రక్షణ కోసం తమ
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. ఒక దుకాణం సీజ్
కోట మైసమ్మ ఆలయంపై 40 ఏళ్ల ఆధిపత్యం ఎప్పటివరకు?
చలో హైదరాబాదుకు తరలిన మున్సిపల్ కార్మికులు 
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం!
కాటారంలో నాథ్ సంకేత్ పత్తి పంట ప్రదర్శన
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్