- District News
- Khammam
- సింగరేణిలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నూతన సారథుల ఎంపిక
సింగరేణిలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నూతన సారథుల ఎంపిక
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడిగా కాంపాటి రవి.. ఎంఎస్పీ అధ్యక్షుడిగా రాయల నరేందర్
కారేపల్లి, అక్టోబర్ 13 (లోకల్ గైడ్ న్యూస్):
సింగరేణి మండలంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నూతన మండల కమిటీలను ఎన్నుకున్నారు. మాదిగ సామాజిక వర్గ అభ్యున్నతి, సామాజిక న్యాయం, హక్కుల సాధన, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నూతన కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడిగా కాంపాటి రవి, ఎంఎస్పీ మండల అధ్యక్షుడిగా రాయల నరేందర్ ఎన్నికయ్యారు.
ఎమ్మార్పీఎస్ కమిటీ ఎన్నిక
మండల ప్రధాన కార్యదర్శులుగా రాయల శ్రీనివాస్, ఆదేర్ల నాగరాజు, ఉపాధ్యక్షులుగా లింగపోగు బసవరాజు, కనకమ పవన్ కుమార్, కార్యదర్శులుగా ఎర్రబెల్లి పవన్, ఆదేర్ల నాగార్జున, సహాయ కార్యదర్శులుగా రాయల అంజి, మెరిగ రాజు ఎన్నికయ్యారు.
ఎంఎస్పీ కమిటీ ఎన్నిక
మండల అధ్యక్షుడిగా రాయల నరేందర్, అధికార ప్రతినిధిగా దండు ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా సరికొండ రాములు, కార్యదర్శిగా చిగురుతి అంజయ్య ఎన్నికయ్యారు. జిల్లా కమిటీలోకి మాజీ మండల నాయకులు: గతంలో మండల స్థాయిలో బాధ్యతలు నిర్వహించిన నాగేంద్రబాబు, ఆదేర్ల రామారావులను జిల్లా కమిటీలోకి ఎన్నుకున్నారు. నూతన నాయకత్వం సంఘాలను గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు బలోపేతం చేస్తూ, మాదిగ సామాజిక వర్గ హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కాంపాటి రవి మాట్లాడుతూ, తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘాల అభివృద్ధికి, సామాజిక న్యాయం సాధనకు, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ ఎంఎస్పీ నాయకులు తూరుగంటి అంజయ్య, ఇన్‌చార్జి నాయకులు కనకప్పుడి జనార్దన్, మండల ఇన్‌చార్జి ఆదేర్ల అంజయ్య, మాజీ మండల అధ్యక్షులు తిప్పారపు నాగేందర్, కేశగాని బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
