- District News
- Khammam
- రాష్ట్ర సుభిక్షం కోసం కోట మైసమ్మ ఆలయంలో చండీ హోమం!
రాష్ట్ర సుభిక్షం కోసం కోట మైసమ్మ ఆలయంలో చండీ హోమం!
వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ దంపతుల ప్రత్యేక పూజలు.. కరువు కాటకాలు తొలగి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థన
కారేపల్లి, అక్టోబర్ 19 (లోకల్ గైడ్ న్యూస్):
కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి గ్రామంలోని ప్రసిద్ధ కోట మైసమ్మ తల్లి ఆలయంలో సోమవారం నిర్వహించిన చండీ హోమంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్–లలిత దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, కరువు కాటకాలు తొలగి ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ డాక్టర్ పర్స పట్టాభి రామారావు, ఈవో కే. వెంకటయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దంపతులకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు యలమంచలి ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన చండీ హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. చండీ హోమం అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పద్మ, తహసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఉసిరికాయలపల్లి సర్పంచ్ వరలక్ష్మి–రాజు దంపతులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
