వికారాబాద్ ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

వికారాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ నమ్రుత 

Published On
వికారాబాద్ ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

 

 

లోకల్ గైడ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

 

వికారాబాద్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డిపో ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. డిపో మేనేజర్ నమ్రత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో సంస్థకు చెందిన మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా జరుపుకున్నారు.

పూల పండుగను పురస్కరించుకుని ఆర్టీసీ డిపోను రంగురంగుల పూలు, ముగ్గులతో సుందరంగా అలంకరించారు. మహిళా ఉద్యోగులు రకరకాల తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి, డిపో ప్రాంగణంలో ప్రతిష్టించారు. అనంతరం బతుకమ్మల చుట్టూ తిరుగుతూ జానపద పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ వేడుకలను కంటికింపుగా నిర్వహించారు.

ఈ సందర్భంగా డిపో మేనేజర్ నమ్రత మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఆర్టీసీ కుటుంబసభ్యుల మధ్య వేడుకగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆర్టీసీ మహిళా సిబ్బందికి, ప్రయాణికులకు ఈ సందర్భంగా ఆమె పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మహిళా ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గాదెపాడు గ్రామంలోని యాదవ బజారు వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి! గాదెపాడు గ్రామంలోని యాదవ బజారు వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!
        కారేపల్లి, అక్టోబర్ 18 (లోకల్ గైడ్ న్యూస్): ఖమ్మం జిల్లా గాదెపాడు గ్రామపంచాయతీ పరిధిలోని యాదవ బజారు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను
గేట్ కారేపల్లి సద్దుల బతుకమ్మ వేడుకల్లో తోటకూరి పిచ్చయ్య దాతృత్వం!
వికారాబాద్ ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
షాద్ నగర్ బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు
రావిర్యాల లో వైభవంగా దుర్గాష్టమి ఉత్సవాలు.
కారేపల్లిలో ఎల్‌నినోపై అలర్ట్‌.. పొదుపు చర్యలకు సర్పంచుల సిద్ధం! రంజిత్ కుమార్ 
బతుకమ్మ ఆడపడుచులకు చీరల కానుక.. గుడిపూడి తిరుమల రావు ఆప్యాయత!