- District News
- Khammam
- గేట్ కారేపల్లి సద్దుల బతుకమ్మ వేడుకల్లో తోటకూరి పిచ్చయ్య దాతృత్వం!
గేట్ కారేపల్లి సద్దుల బతుకమ్మ వేడుకల్లో తోటకూరి పిచ్చయ్య దాతృత్వం!
గ్రామంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటగా.. యువతకు రూ.60 వేల డీజే సౌండ్ సిస్టమ్ అందజేత.. డప్పులు, మేళతాళాలతో పిచ్చయ్య దంపతులకు ఘన స్వాగతం!
గేట్ కారేపల్లి గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తోటకూరి పిచ్చయ్య ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ సెంటర్లో నిర్వహించిన తొమ్మిదో రోజు బ
తుకమ్మ సంబరాల్లో మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా నాయకుడు తోటకూరి పిచ్చయ్య గ్రామ యువతకు రూ.60 వేల విలువైన డీజే బాక్స్, యాంప్లిఫైయర్ను అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గ్రామంలో యువత, మహిళల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు తన వంతు సహకారంగా ఈ సౌండ్ సిస్టమ్ను అందజేశారు. పిచ్చయ్య చేసిన సహాయానికి కృతజ్ఞతగా బతుకమ్మ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు ఆయన దంపతులకు డప్పులు, మేళతాళాలు, టపాసుల సందడితో ఘన స్వాగతం పలికారు. అనంతరం పిచ్చయ్య దంపతులను శాలువాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. బతుకమ్మ ఆటపాటలు, మహిళల కోలాహలంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. సంప్రదాయ పండుగ సంబరాలకు తోడుగా గ్రామ యువతకు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో సహకారం అందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బతుకమ్మ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ మహిళలు, యువత, గ్రామ పెద్దలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
