- District News
- Warangal
- నల్లబెల్లిలో 9 అడుగుల కొండచిలువ కలకలం - చాకచక్యంగా బంధించిన రమేష్
నల్లబెల్లిలో 9 అడుగుల కొండచిలువ కలకలం - చాకచక్యంగా బంధించిన రమేష్
నల్లబెల్లి, అక్టోబర్ 07(లోకల్ గైడ్):
నల్లబెల్లి మండల కేంద్రం సమీపంలోని రైతు పెద్ది కృష్ణారెడ్డి వ్యవసాయ భూమిలో భారీ కొండచిలువ ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సుమారు 9 అడుగుల పొడవు, లావుగా ఉన్న కొండచిలువ పొలంలో సంచరిస్తుండటం గమనించిన రైతులు భయాందోళనకు గురయ్యారు.
విషయం తెలుసుకున్న నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన పిట్టల రమేష్ అక్కడికి చేరుకుని ఎంతో చాకచక్యంగా, ధైర్య సాహసాలతో కొండచిలువను బంధించాడు. అనంతరం దానిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చాడు.
పోలీస్ స్టేషన్ లో ఎస్సై ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారి కిరణ్ కు కొండచిలువను అప్పగించారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో రైతులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ధైర్యంగా కొండచిలువను బంధించి అటవీ అధికారులకు అప్పగించిన రమేష్ ను గ్రామస్తులు, రైతులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో అటవీశాఖ సిబ్బంది కిరణ్, నాగరాజు, స్థానిక పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
