- District News
- Khammam
- గాదెపాడు గ్రామంలోని యాదవ బజారు వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!
గాదెపాడు గ్రామంలోని యాదవ బజారు వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!
ఆటోను ఢీకొట్టిన స్కార్పియో.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
Published On
By Ram Reddy
కారేపల్లి, అక్టోబర్ 18 (లోకల్ గైడ్ న్యూస్):
ఖమ్మం జిల్లా గాదెపాడు గ్రామపంచాయతీ పరిధిలోని యాదవ బజారు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను స్కార్పియో వాహనం ఢీకొట్టినట్లు సమా
చారం. ఈ ప్రమాదంలో వెంకటేష్, రమ్య మృతి చెందినట్లు తెలిసింది. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రమాదం ఎలా జరిగింది? స్కార్పియో వాహనం ఏ పరిస్థితుల్లో ఆటోను ఢీకొట్టిందనే వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:
About The Author
Related Posts
Latest News
18 Oct 2026 21:36:25
కారేపల్లి, అక్టోబర్ 18 (లోకల్ గైడ్ న్యూస్):
ఖమ్మం జిల్లా గాదెపాడు గ్రామపంచాయతీ పరిధిలోని యాదవ బజారు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను
