కారేపల్లి మండల కార్యాలయంలో పోషకాహార ప్రదర్శనలో కలెక్టర్ దివాకర టి.ఎస్ 

ప్రతి స్టాల్‌ను పరిశీలించి.. పోషక పదార్థాల వినియోగం, విలువలపై ఆరా

Published On
కారేపల్లి మండల కార్యాలయంలో పోషకాహార ప్రదర్శనలో కలెక్టర్ దివాకర టి.ఎస్ 

 

 

కారేపల్లి, అక్టోబర్ 6 (లోకల్ గైడ్ న్యూస్):

తొమ్మిదవ జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా కామేపల్లి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో కారేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోషకాహార పదార్థాల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మంగళవారం సందర్శించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ రకాల పోషకాహార పదార్థాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించి, వాటి తయారీ విధానం, వినియోగం, పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిరుధాన్యాలు, ఆకుకూరలు, పప్పులు, కూరగాయలు, పండ్లు తదితర స్థానికంగా లభించే ఆహార పదార్థాలతో తయారు చేసిన వంటకాలను పరిశీలించిన కలెక్టర్.. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సమతుల్య ఆహారం అందించడం, పోషకాహార లోపాన్ని నివారించడంపై అధికారులతో చర్చించారు. ప్రజలకు అందుబాటులో ఉండే పదార్థాలతోనే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తయారు చేసుకునే విధానాలను విస్తృతంగా తెలియజేయాలని సూచించారు. జాతీయ పోషణ మాసోత్సవాల సందర్భంగా ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలను కూడా కలెక్టర్ పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం ప్రాధాన్యతను ప్రజలకు వివరించడంతో పాటు చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. కలెక్టర్ వెంట ఐసీడీఎస్‌ పీడీ ఆలేటి ప్రమీల, కామేపల్లి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధికారి కె.ఉమా, ఐసీడీఎస్‌ సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఆశాలకు రూ.18 వేలు ఇవ్వకపోతే నిరవధిక సమ్మె : గోనే యువరాజు ఆశాలకు రూ.18 వేలు ఇవ్వకపోతే నిరవధిక సమ్మె : గోనే యువరాజు
    నర్సంపేట, అక్టోబర్ 07 (లోకల్ గైడ్):  ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం వెంటనే ఇవ్వాలని
హైదరాబాద్–రంగారెడ్డి మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ వేగవంతం: 
నల్లబెల్లి మండలంలో యూత్ కాంగ్రెస్ దూకుడు : మూడు గ్రామాల్లో ఏకగ్రీవంగా నూతన కమిటీలు
తూము వివాదం - చెరువు కట్టపై ఉద్రిక్తత
వికారాబాద్ ఆర్టీసీ బస్టాండ్ లో హెచ్ఐవి అవగాహన కార్యక్రమం,
కారేపల్లి కస్తూర్బా విద్యాలయంలో కలెక్టర్ దివాకర్.టి.ఎస్ ఆకస్మిక పరిశీలన
కారేపల్లి మండల కార్యాలయంలో పోషకాహార ప్రదర్శనలో కలెక్టర్ దివాకర టి.ఎస్